News December 8, 2024
మధ్యాహ్న భోజనం నాణ్యతను పెంచాలి: డీఈఓ

మధ్యాహ్న భోజనం నాణ్యతను పెంచాలని, విద్యార్థుల ఆరోగ్యం పెంపొందటానికి పుష్టికరమైన ఆహారం చాలా అవసరమని జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖర్ శర్మ అన్నారు. ఖమ్మంలోని అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్లో ఆదివారం నిర్వహించిన మధ్యాహ్న భోజన కుక్ కం హెల్పర్ల జిల్లా స్థాయి వంటలు పోటీలను ఆయన ప్రారంభించారు. పలు స్కూల్స్ కి చెందిన కుక్లు పాల్గొన్నారు.
Similar News
News November 28, 2025
ఖమ్మం జిల్లాలో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికం!

ఖమ్మం జిల్లాలో పలు మండలాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్ల సంఖ్య గణనీయంగా ఎక్కువగా ఉంది. తాజా ఓటర్ల వివరాల ప్రకారం నేలకొండపల్లిలో అత్యధికంగా 2,150 మంది మహిళా ఓటర్లు అదనంగా ఉన్నారు. రఘునాథపాలెం 1,946, కూసుమంచి 1,645, చింతకాని 1,733, ఖమ్మం రూరల్, సత్తుపల్లి, ఏరుపాలెం, తల్లాడ, బోనకల్, పెనుబల్లి, కొణిజర్ల, సింగరేణి వంటి మొత్తం 12 మండలాల్లోనూ పురుషుల కంటే మహిళా ఓటర్లే 1,000కి పైగా అధికంగా ఉన్నారు.
News November 28, 2025
ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో అదనపు కలెక్టర్ శ్రీజ పర్యటన

ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిని అదనపు కలెక్టర్ శ్రీజ గురువారం ఆకస్మికంగా సందర్శించారు. ఆమె ఆసుపత్రిలో జరుగుతున్న సదరం భవన నిర్మాణ పురోగతిని, అలాగే వివిధ సివిల్ పనుల పురోగతిని నిశితంగా పరిశీలించారు. పనుల నాణ్యత విషయంలో రాజీ పడకూడదని, వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. ఆసుపత్రిని మరింత మెరుగైన సౌకర్యాలతో తీర్చిదిద్దాలని అదనపు కలెక్టర్ సూచించారు.
News November 28, 2025
ఖమ్మంకు ఎన్నికల పరిశీలకులు

గ్రామ పంచాయతీ ఎన్నికల సాధారణ పరిశీలకులు ఖర్తడే కాళిచరణ్ సుధామరావు (ఐఏఎస్) గురువారం ఖమ్మం జిల్లాకు విచ్చేశారు. ఎన్ఎస్పీ గెస్ట్ హౌస్లో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మర్యాదపూర్వకంగా ఆయనను కలిసి స్వాగతం పలికారు. అనంతరం పరిశీలకులు, కలెక్టర్తో కలిసి సంబంధిత అధికారులతో ఎన్నికల నిర్వహణపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. ఎన్నికల నియమావళిని కచ్చితంగా అమలు చేయాలని పరిశీలకులు అధికారులను ఆదేశించారు.


