News June 12, 2024

మధ్యాహ్న భోజనం నాణ్యత అంశంలో రాజీపడొద్దు: కలెక్టర్‌

image

పాఠశాలలు పున:ప్రారంభం నుంచి లంచ్‌ అండ్‌ లెర్న్‌ బుధవారం కార్యక్రమాన్ని మరింత పటిష్టంగా నిర్వహించడం జరుగుతుందని తీసుకుంటామని జిల్లా కలెక్టర్‌ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. మధ్యాహ్న భోజనం నాణ్యత అంశంలో ఎక్కడైనా చిన్న పొరపాటు జరిగినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మంగళవారం ఆయన కలెక్టరేట్‌లో సమావేశ మందిరంలో విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో సంబంధిత అధికారులతో సమీక్షించారు.

Similar News

News November 16, 2025

కరీంనగర్: ‘గృహ నిర్మాణంలో పారదర్శకత పాటించాలి’

image

72వ జాతీయ సహకార వారోత్సవాల సందర్భంగా జిల్లా సహకార అధికారి కార్యాలయంలో గృహ నిర్మాణ సహకార సంఘాల అధ్యక్షులకు అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సహకార అధికారి రామానుజాచార్య మాట్లాడుతూ.. అర్హుల ఎంపికలో పారదర్శకత పాటించాలని, నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని సూచించారు. సహకార వ్యవస్థ ప్రజలకు అందుబాటులో ఉండేలా సంఘాలు సేవాభావంతో ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.

News November 16, 2025

కరీంనగర్: ట్రాఫిక్ ఉల్లంఘనలపై కఠిన చర్యలు: సీపీ

image

తమ కార్యాలయ పరిధిలో కొంతమంది పోలీసులు నెంబర్‌ప్లేట్‌ లేని వాహనాలు, హెల్మెట్/సీట్‌బెల్ట్ ధరించకపోవడం, బ్లాక్ ఫిల్మ్‌ వాడటం వంటి ట్రాఫిక్ ఉల్లంఘనలు చేస్తున్నట్లు గుర్తించిన సీపీ, కట్టుదిట్టమైన చర్యలకు ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించేవారికి, పోలీసులు అయినా సరే, కఠినంగా ఈ-చలాన్లు జారీ చేయాలని ఏసీపీ ట్రాఫిక్‌కు ఆయన స్పష్టం చేశారు.

News November 15, 2025

భరోసా కేంద్రాన్ని సందర్శించిన కరీంనగర్ సీపీ

image

కరీంనగర్ భరోసా కేంద్రాన్ని సీపీ గౌష్ ఆలం సందర్శించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. బాధిత మహిళలకు భరోసా కల్పించడంలో ఈ కేంద్రం కీలకపాత్ర పోషిస్తుందని, భరోసా కేంద్రం ఏర్పాటు చేసినప్పటినుండి బాధితులకు అందించిన సేవలు, వాటి సత్ఫలితాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఒకే చోట న్యాయ సహాయం, వైద్యం, సైకోథెరపీ అందించే లక్ష్యంతో పనిచేస్తుందన్నారు.