News May 2, 2024
మనమే నంబర్ వన్: బండి సంజయ్

కరీంనగర్ నగరంలోని మంచిర్యాల చౌరస్తా స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌ను బండి సంజయ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో మనమే నంబర్ వన్. బ్యాలెట్ పేపర్లో కూడా 1వ స్థానం మనదే అన్నారు. ఈనెల 13న జరిగే ఎన్నికల్లో ఎండలను లెక్క చేయకుండా ప్రతి ఒక్కరూ, ఊరూవాడా కదిలి వచ్చి బ్యాలెట్ పేపర్లోని 1వ నంబర్ పక్కనున్న పార్టీ గుర్తుపై బటన్ నొక్కి ఓటేసి బంపర్ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
Similar News
News December 6, 2025
కరీంనగర్: ఈ నెల 22 వరకూ ఫీజు చెల్లించవచ్చు

డాక్టర్ బీ.ఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ పీజీ ప్రథమ, ద్వితీయ, ఎంబీఏ తృతీయ, ద్వితీయ విడత సప్లిమెంటరీ పరీక్షా ఫీజు గడువు ఈనెల 22 వరకు ఉన్నట్లు కరీంనగర్ స్టడీ సెంటర్ కో-ఆర్డినేటర్ ఏం సత్య ప్రకాష్ తెలిపారు. ఫీజును ఆన్లైన్లో చెల్లించవచ్చని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు అధ్యయన కేంద్రంలో సంప్రదించాలని సూచించారు.
News December 6, 2025
EVMలకు కట్టుదిట్టమైన భద్రత.. వివిధ పార్టీలతో పరిశీలన

ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ సమీపంలోని ఈవీఎం గోదాంను అదనపు కలెక్టర్ లక్ష్మికిరణ్ శనివారం తనిఖీ చేశారు. ఆర్డీఓ మహేశ్వర్‌తో పాటు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ సహా పలు పార్టీల ప్రతినిధులు ఈ పరిశీలన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈవీఎంలు, వీవీప్యాట్లకు ఏర్పాటు చేసిన కట్టుదిట్టమైన భద్రతా చర్యలు, పోలీస్ గార్డుల విధులను ఆమె పర్యవేక్షించారు.
News December 6, 2025
కరీంనగర్: అంబేడ్కర్‌కు బండి సంజయ్ నివాళి

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా కరీంనగర్‌లోని ఎంపీ కార్యాలయంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అంబేడ్కర్ సేవలను కొనియాడుతూ.. దేశాభివృద్ధికి ఆయన అందించిన స్ఫూర్తిని గుర్తుచేసుకున్నారు. అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషి చేస్తామని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు.


