News August 11, 2024
మనవరాలిగా దగ్గరై.. జ్యూస్లో మత్తు మందు ఇచ్చి చోరీ

కాకినాడలోని రామారావుపేటలో శ్రీపాద అపార్ట్మెంట్ 4వ అంతస్తులో 79ఏళ్ల వంగ మణికి జ్యూస్లో మత్తు మందు కలిపి ఇచ్చి గుర్తుతెలియని మహిళ చోరీకి పాల్పడింది. దీనిపై టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఒంటరిగా నివసిస్తున్న ఆమె వద్దకు గత నెల 24న ఓ మహిళ వెళ్లి మాయమాటలు చెప్పి మనవరాలిగా పరిచయం చేసుకుంది. జ్యూస్లో మత్తు మందు కలిపి ఇచ్చి రూ.2.16 లక్షల విలువైన 8 కాసులు బంగారం చోరీ చేసింది.
Similar News
News November 8, 2025
తాళ్లపూడి: యాసిడ్ పడి ఇద్దరికి గాయాలు

తాళ్లపూడి మండలం పైడిమెట్టలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. గోతులమయమైన రహదారిపై వెళ్తున్న యాసిడ్ ట్యాంకర్ నుంచి కుదుపులకు యాసిడ్ లీకైంది. అది ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరిపై పడటంతో వారికి గాయాలయ్యాయి. స్థానికులు బాధితులను వెంటనే ఆసుపత్రికి తరలించారు.
News November 8, 2025
రేపు రాజమండ్రిలో ఉద్యోగమేళా

మెప్మా, నిపుణ హ్యూమన్ డెవలప్మెంట్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో నవంబర్ 9న (ఆదివారం) రాజమండ్రి సుబ్రమణ్య మైదానంలో మెగా ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ టి. కనక రాజు శనివారం తెలిపారు. విభిన్న రంగాలకు చెందిన 15కు పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయని వెల్లడించారు. టెన్త్ నుంచి పీజీ, బీటెక్, నర్సింగ్ చేసిన వారు ఈ మేళాను సద్వినియోగం చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.
News November 8, 2025
ఈనెల 10న యథాతధంగా పీజీఆర్ఎస్: కలెక్టర్

పీజీఆర్ఎస్ కార్యక్రమం ఈనెల 10 సోమవారం యథాతధంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు వ్యయప్రయాసలకు గురి కాకుండా తమ డివిజన్, మండల కేంద్రాలు, గ్రామ-వార్డు సచివాలయాల్లోనే అర్జీలు సమర్పించి పరిష్కారం పొందాలని సూచించారు. అలాగే 1100 టోల్ఫ్రీ నంబర్ లేదా meekosam.ap.gov.in వెబ్సైట్ ద్వారా కూడా ఫిర్యాదులు ఇవ్వొచ్చని పేర్కొన్నారు.


