News August 11, 2024
మనవరాలిగా దగ్గరై.. జ్యూస్‌లో మత్తు మందు ఇచ్చి చోరీ
కాకినాడలోని రామారావుపేటలో శ్రీపాద అపార్ట్‌మెంట్ 4వ అంతస్తులో 79ఏళ్ల వంగ మణికి జ్యూస్‌లో మత్తు మందు కలిపి ఇచ్చి గుర్తుతెలియని మహిళ చోరీకి పాల్పడింది. దీనిపై టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఒంటరిగా నివసిస్తున్న ఆమె వద్దకు గత నెల 24న ఓ మహిళ వెళ్లి మాయమాటలు చెప్పి మనవరాలిగా పరిచయం చేసుకుంది. జ్యూస్‌లో మత్తు మందు కలిపి ఇచ్చి రూ.2.16 లక్షల విలువైన 8 కాసులు బంగారం చోరీ చేసింది.
Similar News
News September 14, 2024
ఉమ్మడి తూ.గో. జడ్పీ ఇన్‌ఛార్జి CEOగా పాఠంశెట్టి
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజాపరిషత్ ఇన్‌ఛార్జి సీఈవోగా పాఠంశెట్టి నారాయణ మూర్తి శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఈయన కాకినాడ డివిజన్ డీఎల్డీవో విధులు నిర్వర్తిస్తున్నారు. సీఈవోగా బాధ్యతలు చేపట్టిన అనంతరం జిల్లా కలెక్టర్ షాన్ మోహన్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఇంతవరకు ఇక్కడ సీఈవోగా పనిచేసిన ఎ.శ్రీరామచంద్రమూర్తి రిలీవ్ అయిన విషయం తెలిసిందే.
News September 14, 2024
రాజమండ్రి: 80 ఏళ్ల వృద్ధురాలిపై లైంగిక దాడి
రాజమండ్రి పరిధి హుకుంపేటకు చెందిన 80 ఏళ్ల వృద్ధురాలిపై గుర్తు తెలియని వ్యక్తి లైంగిక దాడికి పాల్పడినట్లు బొమ్మూరు CI కాశీ విశ్వనాథం శుక్రవారం తెలిపారు. వివరాలు.. కుటుంబ కలహాల నేపథ్యంలో వృద్ధురాలు ఇంటి నుంచి బయటకు వచ్చి బస్టాప్‌లో ఉంటుందన్నారు. ఈ క్రమంలో గురువారం అర్ధరాత్రి ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. లేవలేని స్థితిలో ఉన్న ఆమెను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేశామన్నారు.
News September 14, 2024
దివాన్‌చెరువు అటవీ ప్రాంతాల్లో చిరుత కదలికలు
దివాన్ చెరువు అటవీ ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన ట్రాప్ కెమెరాలో చిరుత సంచారానికి సంబంధించిన చిత్రాలు కనిపించాయని జిల్లా అటవీశాఖ అధికారి భరణి శుక్రవారం తెలిపారు. చిరుతను ట్రాప్ బోనులో పట్టుకునేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నామని, కచ్చితంగా దాన్ని పట్టుకుంటామన్నారు. మరోవైపు అటవీ ప్రాంత సమీపంలోని ఆటోనగర్ నుంచి హౌసింగ్ బోర్డు కాలనీ వరకు నేషనల్ హైవేపై అప్రమత్తంగా ఉండాలని బోర్డులు ఏర్పాటుచేశామన్నారు.