News February 7, 2025
మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య

వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన ముదినేపల్లి(M) విశ్వనాద్రిపాలెంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన దయాసాగర్, సింధూర(20)కు ఆర్నెళ్ల క్రితం వివాహం జరిగింది. కాగా సింధూరకు పిల్లలు పుట్టరని వైద్య పరీక్షల్లో తేలింది. దీంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు చేసుకుంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ పద్మజ తెలిపారు.
Similar News
News February 23, 2026
భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

✓ పాల్వంచ: మనస్థాపనతో మహిళ ఆత్మహత్య
✓ దమ్మపేట: రూ.130 లక్షల నగదు, బంగారం లూటీ
✓ భద్రాచలం: గోదావరి వద్ద వైభవంగా నదీ హారతి
✓ పాల్వంచ ఆసుపత్రుల్లో డీఎంహెచ్‌వో తనిఖీలు
✓ రేపు భద్రాచలం ఐటీడీఏలో గిరిజన దర్బార్
✓ పాల్వంచ పెద్దమ్మ తల్లి దర్శనానికి పోటెత్తిన భక్తులు
✓ భద్రాద్రిలో పులి సంచారం.. అప్రమత్తంగా ఉండండి: డీఎఫ్‌వో
✓ ఏప్రిల్‌లో మరో విడత ఇందిరమ్మ ఇళ్లు: ఇల్లందు ఎమ్మెల్యే
News February 23, 2026
BREAKING: భారత్ ఘోర ఓటమి

T20WC సూపర్-8లో అహ్మదాబాద్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 76 పరుగుల తేడాతో ఓడిపోయింది. 188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సూర్య సేన 111 పరుగులకే ఆలౌటైంది. ఇషాన్ 0, అభిషేక్ 15, తిలక్ 1, సూర్య 18, సుందర్ 11, దూబే 42, హార్దిక్ 18, రింకూ 0 పరుగులు చేశారు. SA బౌలర్లలో కేశవ్ 3, మార్కో 4, బోష్ 2, మార్క్రమ్ ఒక వికెట్ తీశారు. ఈ ఓటమితో మిగిలిన రెండు మ్యాచ్‌లనూ భారత్ తప్పక గెలవాల్సిందే.
News February 23, 2026
నా ప్రియ మిత్రుడు మోదీ కోసం ఎదురుచూస్తున్నా: నెతన్యాహు

భారత్-ఇజ్రాయెల్ బంధం ఇద్దరు ప్రపంచ నాయకుల శక్తిమంతమైన కూటమి అని ఇజ్రాయెల్ PM నెతన్యాహు అభిప్రాయపడ్డారు. ‘నా ప్రియ మిత్రుడు మోదీ ఈ నెల 25న వస్తున్నారు. జెరూసలేంలో ఆయన కోసం ఎదురుచూస్తున్నా. మేం ఇన్నోవేషన్, సెక్యూరిటీ, స్ట్రాటజిక్ విజన్‌లో భాగస్వాములం. స్థిరత్వం, అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. AI నుంచి ప్రాంతీయ సహకారం వరకు మా పార్ట్నర్షిప్ కొత్త శిఖరాలకు చేరుకుంటుంది’ అని ట్వీట్ చేశారు.


