News February 7, 2025

మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య

image

వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన ముదినేపల్లి(M) విశ్వనాద్రిపాలెంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన దయాసాగర్, సింధూర(20)కు ఆర్నెళ్ల క్రితం వివాహం జరిగింది. కాగా సింధూరకు పిల్లలు పుట్టరని వైద్య పరీక్షల్లో తేలింది. దీంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు చేసుకుంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ పద్మజ తెలిపారు.

Similar News

News March 26, 2025

నంద్యాల జిల్లాలో నేటి ముఖ్యాంశాలు.!

image

☞ దొర్నిపాడులో శిథిలావస్థకు చేరిన కుందూ నది వంతెన
☞ HYDలో న్యాయవాది హత్య.. నంద్యాలలో న్యాయవాదుల విధుల బహిష్కరణ
☞ కొలను భారతి ఆలయ అర్చకుడిపై దాడి
☞ తెలుగు గంగకు రూ.100 కోట్లు
☞ఆళ్లగడ్డ MLA అడుగుకు ‘రూపాయి పవాల’ కమిషన్: YCP
☞ శ్రీశైల క్షేత్రంలో కన్నడ భక్తుల సందడి ☞ ఆదోనిలో యువకుడి బలవన్మరణం
☞ కోడుమూరు ఘటన.. సిగరెట్ తీసుకురాలేదని.!
☞ సంజామల రైల్వే స్టేషన్ లో కొరవడిన సౌకర్యాలు

News March 26, 2025

IPL-2025: KKR టార్గెట్ ఎంతంటే?

image

గువాహటిలో జరుగుతున్న మ్యాచ్‌లో KKRపై RR 9 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసింది. టాప్ ఆర్డర్ బ్యాటర్లెవరూ 30+ పరుగులు చేయకపోవడంతో రన్‌రేట్ నెమ్మదిగా కదిలింది. హసరంగా(4)ను బ్యాటింగ్ ఆర్డర్లో పైకి పంపడం వర్కౌట్ అవ్వలేదు. జురెల్ 33 పరుగులతో రాణించారు. చివర్లో ఆర్చర్ 2 సిక్సులతో మెరిశారు. వైభవ్ అరోరా, మొయిన్ అలీ, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా తలో 2 వికెట్లు తీశారు. KKR టార్గెట్ 152 పరుగులు.

News March 26, 2025

మా జోలికి వస్తే ఎవరినైనా వదలబోం: నాటో

image

పోలాండ్ సహా అన్ని సభ్యదేశాల భద్రతకు నాటో కట్టుబడి ఉందని సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే చెప్పారు. తమ జోలికి వస్తే ఎవరినైనా వదిలిపెట్టబోమని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను హెచ్చరించారు. తమపై దాడి చేసి తప్పించుకోగలమని అనుకుంటే పెద్ద తప్పిదమే అవుతుందని స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌తో యుద్ధం విషయంలో రష్యా-అమెరికా మధ్య సానుకూల చర్చలు జరుగుతున్న వేళ రుట్టే వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

error: Content is protected !!