News April 10, 2024
మనుక్రాంత్ ఎక్కడ..?

జనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి కొద్ది రోజులుగా రాజకీయంగా యాక్టివ్‌గా లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. పొత్తులో భాగంగా జిల్లాలో జనసేనకు ఎక్కడా పోటీ చేసే అవకాశం లభించలేదు. మొదట్లో కూటమికి సంబంధించిన కొన్ని సమావేశాల్లో పాల్గొన్నప్పటికీ ఇటీవల ప్రచారంలో ఎక్కడా ఆయన ఊసే లేదు. ఈక్రమంలో ఆయన రాజకీయ కార్యాచరణపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
Similar News
News March 26, 2025
నెల్లూరు:నెలాఖరు వరకు ఆస్తి పన్ను వడ్డీ పై 50% రాయితీ

ఆస్తి పన్ను పై వడ్డీలో 50 శాతం రాయితీ ఇస్తున్నట్లు రాష్ట్ర మున్సిపల్ శాఖ ఉత్తర్వులను జారీ చేసిందని నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ సూర్య తేజ మంగళవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులకు తోడు పేరుకుపోయిన కోట్లాది రూపాయల మొండిబకాయిల వసూళ్ల కోసం రాయితీ నిర్ణయాన్ని తీసుకున్నట్లు కమిషనర్ తెలిపారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
News March 25, 2025
జాతీయ ఆహార భద్రత మిషన్ పేరు మార్చారా?

కేంద్ర ప్రభుత్వం జాతీయ ఆహార భద్రత మిషన్ పేరు మార్చిందా అని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు. ఈ మేరకు లోక్ సభలో ఆయన పలు అంశాలపై చర్చించారు. పోషకాహార లక్ష్యాల సాధనలో జాతీయ ఆహార భద్రత మిషన్ పేరు మార్పు ఎంతవరకు సహాయపడుతుందని ప్రశ్నించారు. సాంప్రదాయ రకాల పంటలు, తృణధాన్యాలు, మినుములలో విత్తన లభ్యతను పెంపొందించడంలో ఈ పథకం ఎంత వరకు సహాయ పడుతుందో తెలియజేయాలన్నారు.
News March 25, 2025
నెల్లూరు జిల్లాలో తగ్గిన ధరలు..?

నెల్లూరులో జిల్లాలో వరి కోతలు ప్రారంభం అయ్యాయి. నిరుడు పుట్టి(20 బస్తాలు) రూ.23వేల ధర పలగ్గా.. ఇప్పుడు ఆ ధర రూ.18,500కు తగ్గినట్లు రైతులు తెలిపారు. మరికొన్ని చోట్ల ఈ ధర రూ.16వేల వరకు ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వం రైతులకు రూ.19వేల మద్దతు ధర చెల్లిస్తుంది. ధరలు పడిపోవడంతో పెట్టుబడులు కూడా రావంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీ ఊరిలో ధాన్యం ధరలు ఎలా ఉన్నాయో గ్రామం, మండలంతో కామెంట్ చేయండి.