News July 28, 2024

మనుబోలులో వ్యక్తిపై కత్తులతో దాడి.. పరిస్థితి విషమం

image

మనుబోలు గ్రామానికి చెందిన మొలకల శశిధర రెడ్డిపై గూడూరు మండలం వెందోడు గ్రామానికి చెందిన మద్దాలి హర్ష వర్ధన్ రెడ్డి తన స్నేహితులతో కలిసి కత్తులతో దాడికి పాల్పడ్డారు. దీంతో శశి ధరరెడ్డి పరిస్థితి విషమంగా ఉండటంతో గూడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మనుబోలు పోలీసులు కేసు నమోదు చేసుకుని దాడికి గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకుంటున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Similar News

News December 11, 2024

రాజముద్రలతో నూతన పాస్ పుస్తకాలు: మంత్రి ఆనం

image

జగన్ బొమ్మలు తొలగించి రాష్ట్ర ప్రభుత్వ రాజముద్రలతో రైతులకు పాస్ పుస్తకాలు అందజేస్తున్నట్లు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన ఆత్మకూరు నియోజకవర్గంలోని పొంగూరు, నాగులపాడు రెవెన్యూ సదస్సులో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ..పాస్ పుస్తకలపై జగన్ ఫోటోను తొలగించి రాజముద్రలతో ముద్రితమవుతాయని, భూ సమస్యలను పరిష్కరించి, రైతులకు పూర్తి హక్కులు కల్పించడమే రెవెన్యూ సదస్సుల లక్ష్యమని తెలిపారు. 

News December 10, 2024

గూడూరు: తల్లికి సాయం చేస్తానని లోకేశ్ హామీ

image

గూడూరు నియోజకవర్గం చిల్లకూరు మండలం కలవకొండకు చెందిన మోహిందర్ తల్లి అనారోగ్యానికి గుర్యారు. నెల్లూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యశ్రీ, సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆదుకోవాలని మోహిందర్ సోషల్ మీడియాలో మంత్రి నారా లోకేశ్‌కు విజ్ఞప్తి చేశారు. దీనికి నారా లోకేశ్ స్పందించారు. తన టీం చూసుకుంటుందని.. సాధ్యమైనంత వరకు సాయం చేస్తానని లోకేశ్ రిప్లే ఇఛ్చారు.

News December 10, 2024

తిరుప‌తిలో రైల్వే డివిజ‌న్ ఏర్పాటు చేయండి: ఎంపీ

image

తిరుప‌తి కేంద్రంగా బాలాజీ రైల్వే డివిజన్‌ను ఏర్పాటు చేయాల‌ని ఎంపీ డాక్ట‌ర్ మ‌ద్దిల గురుమూర్తి కేంద్ర ప్ర‌భుత్వానికి విజ్ఞ‌ప్తి చేశారు. పార్ల‌మెంట్ శీతాకాలం స‌మావేశాల్లో భాగంగా జీరో అవ‌ర్‌లో మంగ‌ళ‌వారం తిరుప‌తి ఎంపీ ఈ అంశాన్ని లేవ‌నెత్తారు. పార్లమెంటులో ఆయన మాట్లాడుతూ..ప్ర‌సిద్ధ ఆధ్మాత్మిక క్షేత్ర‌మైన తిరుప‌తి విశిష్ట‌త‌ల‌ను వివరిస్తూ రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.