News May 10, 2024
మనుబోలు జాతీయరహదారిపై ప్రమాదం

మనుబోలులోని జాతీయ రహదారిపై శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో వేగంగా వెళుతున్న ఓ బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొంది. దీంతో బైక్‌పై ప్రయాణిస్తున్న ఓ యువకుడు అక్కడికక్కడే మరణించగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుడిని దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
Similar News
News July 8, 2025
నెల్లూరు రాజకీయాలకు మాయని మచ్చ..!

హుందాగా నడిచే నెల్లూరు రాజకీయాలు వ్యక్తిగత దూషణలకు వెళ్లాయి. పర్సంటేజీల ప్రసన్న, అప్పుల్లో పీహెచ్‌డీ చేసిన ప్రసన్న అంటూ ప్రశాంతి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చే క్రమంలో ఆయన శ్రుతిమించారు. ‘ప్రశాంతి రెడ్డి చాలా చోట్ల PHdలు చేశారు. పీహెచ్‌డీలు అంటే మీరు అనుకునేవి కావు. వేమిరెడ్డిని బ్లాక్‌మెయిల్ చేసి పెళ్లి చేసుకుంది. ఆయనకు ప్రాణహాని ఉంది’ అని ప్రసన్న అన్నారు. ఈ ఇద్దరి వ్యాఖ్యలపై మీరేమంటారు?
News July 8, 2025
ఆ దాడికి మాకు సంబంధం లేదు: ప్రశాంతిరెడ్డి

మహిళ అని చూడకుండా నీచమైన వ్యాఖ్యలు చేసిన ప్రసన్నను ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు సమర్ధించడం సరికాదని వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. ‘ప్రసన్నపై మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేస్తా. ఆయన నివాసంపై జరిగిన దాడికి మాకు ఎలాంటి సంబంధం లేదు. నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి గొప్ప వ్యక్తి కడుపున పుట్టిన నీచుడు ప్రసన్న’ అని ఆమె మండిపడ్డారు
News July 7, 2025
అనామకులతో అప్రమత్తంగా ఉండాలి: SP

మీ రక్షణే మా భద్రతగా నెల్లూరు పోలీసులు విధులు నిర్వహిస్తున్నారని ఎస్పీ కృష్ణకాంత్ తెలిపారు. నెల్లూరు బారాషహిద్ దర్గాలో రెండో రోజు కొనసాగుతున్న రొట్టెల పండుగలో పోలీసు బందోబస్తు, గంధ మహోత్సవానికి చేసిన ఏర్పాట్లను ఆయన పోలీసు అధికారులు, టీడీపీ నాయకులతో కలిసి పరిశీలించారు. రాత్రికి జరగనున్న ప్రధాన ఘట్టం అయిన గంధ మహోత్సవానికి పగడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. అనామకులతో అప్రమత్తంగా ఉండాలన్నారు.