News September 24, 2024

మనుబోలు: త్రుటిలో తప్పిన పెను ప్రమాదం

image

మనుబోలు మండల కేంద్రంలోని బైపాస్ రోడ్డుపై ఓ ట్రావెల్ బస్సుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. మంగళవారం విజయవాడ నుంచి చెన్నైకి 18 మంది ప్రయాణికులతో వెళ్తుండగా.. యాచవరం రోడ్డు దాటాక బస్సు టైరు పగిలిపోయింది.దీంతో బస్సు అదుపుతప్పి మరో వైపు వెళ్లిపోయింది. ఆసమయంలో వేరే వాహనాలు ఉండకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని ప్రయాణికులు అన్నారు. బస్సును క్రేన్ సాయంతో పక్కకు తొలగించినట్లు బస్సు సిబ్బంది తెలిపారు.

Similar News

News October 4, 2024

రైల్వే ప్రాజెక్టులపై ఎంపీ వీపీఆర్ చర్చ

image

విజయవాడలోని సత్యనారాయణపురం ఈటీటీ సెంటర్‌లో దక్షిణ మధ్య రైల్వే అధికారుల సమావేశం శుక్రవారం జరిగింది. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సమావేశానికి హాజరై పలు అంశాలను ప్రస్తావించారు. జిల్లాలో దుస్థితిలో ఉన్న రైల్వే స్టేషన్ల అభివృద్ధి, నడికుడి రైల్వే లైను తదితర అంశాలపై చర్చించారు.

News October 4, 2024

పెన్నా నదిలో యువతి మృతి

image

నెల్లూరు పెన్నా బ్యారేజ్ వద్ద ఓ యువతి మృతదేహం కలకలం రేపింది. ఈరోజు ఉదయం రంగనాయకుల స్వామి గుడి వెనుక నదిలో యువతి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. ఆమె బుర్కా ధరించి ఉన్నారు. సుమారు 18 నుంచి 20 ఏళ్ల లోపు వయస్సు ఉంటుంది. ఆమె ఆచూకీ తెలిసిన వాళ్లు నెల్లూరు సంతపేట పోలీసులను సంప్రదించాలని కోరారు.

News October 4, 2024

రాజకీయ పార్టీలకు నెల్లూరు కలెక్టర్ సూచనలు

image

నెల్లూరు జిల్లాలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించుకోవాలని కలెక్టర్ ఒ.ఆనంద్ కోరారు. ఆయన మాట్లాడుతూ.. స్పెషల్ సమ్మరి రివిజన్-2025లో భాగంగా ఈనెల 29న డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా ప్రచురిస్తారని తెలిపారు. వాటిపై నవంబర్ 28 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారని చెప్పారు. డిసెంబర్ 24వ తేదీ లోపు అభ్యంతరాలను పరిష్కరించి.. 2025 సంవత్సరం జనవరి 6వ తేదీన తుది ఓటర్ల జాబితా ప్రచురిస్తామన్నారు.