News January 13, 2025

మనుబోలు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు దుర్మరణం

image

మనుబోలు మండలం, కాగితాలపూరు వద్ద ఆదివారం రాత్రి ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. నెల్లూరు నుంచి గూడూరు వైపు బైక్‌పై వెళ్తున్న ఇద్దరిని వెనుక నుంచి ఓ లారీ ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న మనుబోలు పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News February 25, 2026

నెల్లూరు: 27న ట్రై స్కూటీల కోసం ఇంటర్వ్యూలు

image

ఈనెల 27న ట్రై స్కూటీల మంజూరుకు విభిన్న ప్రతిభావంతులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ జిల్లా మేనేజర్ మహమ్మద్ అయూబ్ తెలిపారు. జిల్లాలో ట్రై స్కూటర్ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికేట్లను దరఖాస్తు సమయంలో సమర్పించాల్సి ఉంటుందన్నారు. నెల్లూరులోని JC ఛాంబర్‌లో ఉదయం 10 గంటల నుంచి ఇంటర్వ్యూలు జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు.

News February 25, 2026

నెల్లూరు: రెండో రోజు 899 మంది ఆబ్సెంట్.!

image

నెల్లూరు జిల్లాలో ఇంటర్ మొదటి సంవత్సరం రెండో రోజు పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఎక్కడ మాల్ ప్రాక్టీసింగ్‌కు తావు లేకుండా పరీక్ష జరిగినట్లు ఆర్ఐవో వరప్రసాద్ రావు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 81 కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షలకు 27,790 మంది విద్యార్థులకు గాను 26,891 మంది హాజరయ్యారని 899 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఆయన తెలిపారు.

News February 25, 2026

ఆ భూములను కాపాడండి: అసెంబ్లీలో సోమిరెడ్డి

image

సర్వేపల్లిలో హైవే పక్కన రూ.100కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కాపాడాలని MLA సోమిరెడ్డి కోరారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. ‘సర్వేపల్లిలో గత ఐదేళ్లు చాలా ఘోరాలు జరిగాయి. MSME పార్కు పేరుతో 50 ఎకరాలు, సూరాయపాలెంలో 30 ఎకరాలు, కొమ్మలపూడిలో 19 ఎకరాల భూమిలో స్కామ్ జరిగింది. దీనిపై ఏమైనా చర్యలు మొదలె పెడితే కోర్టుకెళ్లి స్టే తెచ్చుకుంటున్నారు. దీనిపై రెవెన్యూ మంత్రి సమీక్ష చేయాలి’ అని ఆయన విన్నవించారు.