News January 2, 2025
మనూ భాకర్, గుకేశ్‌లకు ఖేల్ రత్న

ఊహాగాలనాలకు తెరదించుతూ స్టార్ షూటర్ మనూభాకర్‌కు కేంద్ర ప్రభుత్వ ఖేల్ రత్న అవార్డు ప్రకటించింది. అవార్డుకు దరఖాస్తు విషయమై మనూ భాకర్‌కు అవార్డుల కమిటీకి మధ్య వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. వరల్డ్ చెస్ ఛాంపియన్ గుకేశ్ దొమ్మరాజు, పారా అథ్లెట్ ప్రవీణ్ కుమార్, హాకీ ప్లేయర్ హర్మన్ ప్రీత్ సింగ్లకూ కేంద్రం ఈ అవార్డును ప్రకటించింది. ఈ నెల 17న ప్రదానం చేయనున్నారు.
Similar News
News November 6, 2025
BRSకు గుణపాఠం చెప్పాలి: మానకొండూర్ MLA

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో BRS, BJPకి గుణపాఠం చెప్పే సమయం వచ్చిందని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. గురువారం షేక్‌పేటలో గడపగడపకు ప్రచారం నిర్వహించిన ఆయన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా ఉన్న బీఆర్ఎస్ నేత అభివృద్ధి చేయలేదని, బీజేపీపై నమ్మకం లేదని విమర్శించారు.
News November 6, 2025
బయోమాస్‌తో రైతులకు ఆదాయం, ఉపాధి: సారస్వత్

AP: గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి బయోమాస్ ఎంతో ఉపయుక్తమని AP గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ అడ్వయిజరీ బోర్డు ఛైర్మన్ సారస్వత్ పేర్కొన్నారు. బయోమాస్‌లో ఏపీ నం.1గా ఉందన్నారు. రైతులకు ఆదాయంతో పాటు ఉపాధి మెరుగుపడుతుందని బోర్డు భేటీలో చెప్పారు. విశాఖ(D) పూడిమడక వద్ద ₹1.85 L కోట్లతో NGEL హైడ్రోజన్ హబ్‌ను నెలకొల్పుతోందని CS విజయానంద్ తెలిపారు. రోజుకు 1,500 టన్నుల గ్రీన్ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేస్తారని చెప్పారు.
News November 6, 2025
జుట్టుకు రంగు వేస్తున్నారా?.. జాగ్రత్త!

పదేపదే హెయిర్ డై లేదా కలరింగ్ చేసుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యం దెబ్బతింటుందని ముంబై హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ అభిషేక్ పిలానీ హెచ్చరించారు. ‘తరచుగా రంగులు వేయడం వల్ల జుట్టులోని కెరాటిన్ దెబ్బతిని పెళుసుగా మారడం, చివర్లు చిట్లడం జరుగుతుంది. అమోనియా, పెరాక్సైడ్ వంటి తీవ్రమైన రసాయనాలు జుట్టుకు శాశ్వత నష్టం కలిగిస్తాయి. జుట్టు రాలడం, పలుచబడటం వంటి సమస్యలు తీవ్రమవుతాయి’ అని పేర్కొన్నారు.


