News April 15, 2025
మనోహరాబాద్: యువతి అదృశ్యం..!

మనోహరాబాద్ మండలం కాళ్లకల్ గ్రామానికి చెందిన యువతి అదృశ్యమైనట్లు మనోహరాబాద్ ఎస్సై సుభాష్ గౌడ్ తెలిపారు. ‘కాళ్లకల్‌కు చెందిన మన్నె నాగలక్ష్మి (19) మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అత్వెల్లి వద్దగల నేషనల్ మార్ట్‌లో పనిచేసేందుకు ఆదివారం ఉదయం ఇంటి నుంచి వెళ్లింది. రాత్రి ఇంటికి రాకపోగా, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని’ చెప్పారు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆయన వివరించారు.
Similar News
News November 18, 2025
బనకచర్ల పేరు మార్చి అనుమతులకు ఏపీ యత్నం: ఉత్తమ్

SC స్టే ఉన్నా ఆల్మట్టి ఎత్తు పెంచేందుకు కర్ణాటక ప్రయత్నిస్తోందని TG మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఎత్తు పెంచొద్దని కోర్టు చెప్పిందన్నారు. కేంద్ర మంత్రి CR పాటిల్‌తో భేటీ అనంతరం ఆయన మాట్లాడారు. ‘పోలవరం-బనకచర్లను వ్యతిరేకించాం. పేరు మార్చి AP అనుమతులకు యత్నిస్తోంది. దీనిపై కేంద్రానికి ఫిర్యాదు చేశాం. ప్రాణహిత-చేవెళ్ల, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులకు నిధులు కోరాం’ అని మంత్రి వివరించారు.
News November 18, 2025
అనకాపల్లి: ‘రోజుకు 30-40 సదరం స్లాట్స్’

అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రిలో నిర్వహిస్తున్న సదరన్ క్యాంపు ఏర్పాట్లను ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ మంగళవారం పరిశీలించారు. ఈ క్యాంపునకు వచ్చిన దివ్యాంగులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పింఛన్ల అర్హత ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకున్న దివ్యాంగులకు రోజుకు 30-40 స్లాట్స్ ఇవ్వడం జరుగుతుందన్నారు. అనంతరం ఆసుపత్రిలో వివిధ విభాగాలను పరిశీలించారు. దీనిని ఆధునీకరించాల్సి ఉందన్నారు.
News November 18, 2025
వాట్సాప్ ఛానెల్ ద్వారా ‘జైషే’ ఉగ్ర ప్రచారం

ఉగ్ర సంస్థ జైషే మహ్మద్ డిజిటల్ నెట్వర్క్ ద్వారా యువతను టెర్రరిజమ్ వైపు మళ్లిస్తోంది. ఈ సంస్థకు సంబంధించిన వాట్సాప్ ఛానెల్‌ను నిఘా సంస్థలు గుర్తించాయి. ఈ ఛానెల్‌కు 13వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. దీని ద్వారా వేలాది మందిని ఉగ్రమూకలుగా JeM మారుస్తోంది. కాగా ఢిల్లీ పేలుళ్ల కేసులో అరెస్టు చేసిన డానిష్‌ను పోలీసులు పటియాలా హౌస్ కోర్టులో హాజరుపరిచారు. అతడిని 10 రోజుల పాటు ఎన్ఐఏ కస్టడీకి అప్పగించింది.


