News December 27, 2024

మన్మోహన్‌సింగ్‌ రాజనీతిజ్ఞత గొప్పది: KCR

image

మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ రాజనీతిజ్ఞత గొప్పదని మాజీ సీఎం KCR అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు చిన్నాభిన్నం అవుతుంటే భారత ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుకొని నిలబడేందుకు నాటి ప్రధానిగా పీవీ నర్సింహారావు సంస్కరణల రూపం వెనుక ఉంది మన్మోహన్‌సింగ్‌ అన్నారు. దశాబ్దాలపాటు తెలంగాణపై కొనసాగిన అణచివేతలు, ఆర్థిక దోపిడి, సామాజిక, సాంస్కృతిక వివక్ష తెలిసిన అతికొద్ది మంది నాయకుల్లో మన్మోహన్‌ ఉంటారన్నారు.

Similar News

News January 26, 2025

మెదక్: జిల్లా వ్యాప్తంగా మొత్తం 544 సభలు: కలెక్టర్

image

మెదక్ జిల్లా వ్యాప్తంగా 21 నుంచి 23 వరకు 469 గ్రామ సభలు నిర్వహించినట్టు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు ఆయన మాట్లాడుతూ.. మెదక్ జిల్లా వ్యాప్తంగా 75 వార్డు సభలు నిర్వహించామన్నారు. జిల్లా వ్యాప్తంగా రేషన్ కార్డుకు 40,092, ఇందిరమ్మ ఇళ్లకు 23,383, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు 5,501, రైతు భరోసాకు 308 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు.

News January 25, 2025

మెదక్: జిల్లాలో 88 ఉత్తమ అధికారుల ఎంపిక

image

మెదక్ జిల్లాలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా 88 మంది ఉత్తమ అధికారులు, పోలీస్, ప్రభుత్వ సిబ్బందిని ఎంపిక చేశారు. వీరికి ప్రశంసా పత్రాలను కలెక్టర్ రాహుల్ రాజ్ చేతులమీదుగా అందజేయనున్నారు. ప్రతి ఏటా ఉత్తమ అధికారులకు ప్రశంసా పత్రాలు అందజేస్తున్నారు. రెవెన్యూ, పోలీస్, ఇతర ప్రభుత్వ శాఖల్లో పనిచేసే జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయిలో పనిచేసే వారిని ఎంపిక చేస్తారు.

News January 25, 2025

మెదక్: వైద్యా, విద్య ప్రమాణాలు మెరుగుపడాలి: మంత్రి

image

వైద్యా, విద్య ప్రమాణాలు మెరుగుపడేలా మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి దామోదర్ రాజనర్సింహ సూచించారు. నూతనంగా నియమితులైన రాష్ట్ర మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నరేంద్ర కుమార్ మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మెడికల్ కాలేజీలు టీచింగ్ హాస్పిటల్ అభివృద్ధికి కృషి చేయాలని పేర్కొన్నారు.