News December 28, 2024

మన్మోహన్ పార్థివదేహానికి ఎంపీ వద్దిరాజు నివాళి

image

ప్రధాన మంత్రిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ భారతదేశానికి చేసిన సేవలు మరువలేనివని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. ఈరోజు ఢిల్లీలో ఆయన పార్థివదేహానికి కేటీఆర్‌, వద్దిరాజు రవిచంద్ర పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆర్థిక సంస్కరణల ప్రముఖుడిగా పేరుగాంచిన ఆయన మరణం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు.

Similar News

News December 20, 2025

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కలిసిన ఎంపీ కావ్య

image

WGL కేయూలో అమలవుతున్న రూసా 2.0 (రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్) ప్రాజెక్టుల గడువు పెంచాలని WGL ఎంపీ కడియం కావ్య కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కోరారు. ఢిల్లీలో ఆమె మంత్రిని కలిసి వినతిపత్రం అందించారు. రూసా కింద మంజూరైన రూ.50 కోట్లతో పరిశోధన కేంద్రాలు, వ్యక్తిగత రీసెర్చ్ ప్రాజెక్టులు, కె-హబ్, మౌలిక వసతుల పనులు కొనసాగుతున్నాయని వివరించారు. ప్రస్తుత గడువును మార్చి 31, 2027కు పెంచాలన్నారు.

News December 19, 2025

విపత్తుల నిర్వహణ సన్నద్ధతపై ఈనెల 22న మాక్‌డ్రిల్

image

ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు వాటిని సమర్ధవంతంగాఎలా ఎదుర్కోవాలనే అంశాలపై ఈనెల 22వ తేదీన చిన్నవడ్డేపల్లి చెరువు ప్రాంతంలో ప్రయోగాత్మకంగా చేపట్టే మాక్ ఎక్సర్ సైజ్ ను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ డా.సత్యశారద అధికారులను ఆదేశించారు. విపత్తులు సంభవించినప్పుడు ప్రాణ, ఆస్తి నష్టం నివారణకు తక్షణ చర్యలపై సన్నద్ధత కోసం ఈమాక్ ఎక్సర్ సైజ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

News December 19, 2025

వరంగల్‌లో జిల్లాస్థాయి స్పోర్ట్స్ మీట్ ప్రారంభం

image

వరంగల్ టీజీఎంఆర్‌ఎస్&జూనియర్ కాలేజ్‌లో జిల్లా పరిధి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌ను మంత్రి కొండా సురేఖ క్రీడా పోటీలను శుక్రవారం ప్రారంభించారు. విద్యార్థుల శారీరక, మానసిక అభివృద్ధికి క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని మంత్రి అన్నారు. టీచర్స్ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఆర్డీవో సుమ పాల్గొన్నారు.