News December 27, 2024
మన్మోహన్ సింగ్ మృతి పట్ల పొంగులేటి సంతాపం
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతి దేశానికి తీరని లోటన్నారు. మన్మోహన్ సింగ్ కుటుంబానికి, అభిమానులకు పొంగులేటి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ దేశంలో అనేక ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారని గుర్తుచేసుకున్నారు. కేంద్రమంత్రిగా, ప్రధానిగా దేశానికి నిర్విరామంగా సేవలందించారని కొనియాడారు.
Similar News
News January 12, 2025
ఖమ్మంలో 2 రోజులు పర్యటించనున్న Dy.CM భట్టి
ఖమ్మం జిల్లాలో రెండు రోజులు పాటు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటించనున్నట్లు భట్టి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ‘సోమవారం రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులపై అధికారులతో చర్చించనున్నారు. సాయంత్రం 2 గంటలకు రఘునాథపాలెం మండలం మంచుకొండలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రారంభిస్తారు. మంగళవారం మధిరలో జరిగే సంక్రాంతి వేడుకల్లో పాల్గొననున్న’ట్లు వివరించారు.
News January 12, 2025
కొనిజర్ల: లారీని, బస్సును ఢీ కొట్టిన మరో లారీ
ఖమ్మం జిల్లా కొనిజర్ల సమీపంలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీని, ట్రావెల్ బస్సును మరో లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రెండు లారీల డ్రైవర్లకు గాయాలయ్యాయి. ట్రావెల్ బస్సు డ్రైవర్ చాకచక్యంతో వ్యవహరించడంతో 56 మంది ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. ప్రయాణికులను వేరే బస్సులో తరలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News January 12, 2025
ఖమ్మం: లారీ డ్రైవర్ నిర్లక్ష్యానికి యువకుడు బలి
లారీ డ్రైవర్ నిర్లక్ష్యానికి ఓ యువకుడు బలైన ఘటన నగరంలోని ఎన్టీఆర్ సర్కిల్లో శనివారం చోటుచేసుకుంది. సీఐ బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. టేకులపల్లి మండలం వెంకటాయ తండాకు చెందిన శ్రీనివాస్ డిప్లొమా చదువుతున్నాడు. నగరానికి పని నిమిత్తం బైక్‌పై వస్తుండగా ఎన్టీఆర్ సర్కిల్ వద్ద శ్రీనివాస్ బైక్‌ను లారీ ఢీ కొట్టింది. ఈఘటనలో శ్రీనివాస్ లారీ చక్రాల కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు.