News April 7, 2025
మన్యంకొండలో వైభవంగా శ్రీరామ పట్టాభిషేకం..!

మన్యంకొండ శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాల్లో వైభవంగా జరుగుతున్నాయి. రాముడి కళ్యాణం అనంతరం ఈరోజు ఆనవాయితీ ప్రకారం ఆలయ ప్రాంగణంలోని దర్బార్ మంటపమైన లక్ష్మీ విలాసంలో శ్రీరాముడి పట్టాభిషేకానికి స్వామివారిని అలంకరించారు. శ్రీరామ మహా పట్టాభిషేక మహోత్సవ వేడుకలతో మన్యంకొండ పులకించింది. వేదమంత్రోచ్ఛరణల మధ్య సింహాసనాన్ని అధిష్ఠించిన రాములవారిని భక్తులు దర్శించుకున్నారు.
Similar News
News November 23, 2025
KMR: రైలు ఢీకొని 80 గొర్రెల మృతి.. కాపరి గల్లంతు

కామారెడ్డి రైల్వే ట్రాక్ సమీపంలో ఆదివారం రైలు ఢీకొని సుమారు 80 గొర్రెలు మృతి చెందాయి. రైలు రాకను గమనించి వాటిని కాపాడుకునే ప్రయత్నంలో గొర్రెల కాపరి సురేష్ పెద్ద వాగులోకి దూకారు. అయితే, ఆయనతో పాటు ఉన్న మరో కాపరి, 35 ఏళ్ల ధర్షపు సుధాకర్, ఈత రాకపోవడంతో వాగులో గల్లంతయ్యారు. సుధాకర్ ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. పోలీసులు, రెస్క్యూ సిబ్బంది గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News November 23, 2025
సిరిసిల్ల డీఎస్పీగా నాగేంద్ర చారి నియామకం

సిరిసిల్ల సబ్ డివిజనల్ పోలీస్ అధికారిగా కే.నాగేంద్ర చారి నియమితులయ్యారు. ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తున్న చంద్రశేఖర్ రెడ్డిని డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. నిజామాబాద్ సీసీఎస్ విభాగంలో పనిచేస్తున్న నాగేంద్ర చారిని సిరిసిల్లకు బదిలీ చేశారు. నాగేంద్ర చారి గతంలో వేములవాడ డీఎస్పీగా విధులు నిర్వర్తించారు.
News November 23, 2025
మధ్యవర్తిత్వం వేగవంతమైన న్యాయానికి కీలకం: జస్టిస్ లక్ష్మణ్

కేసుల భారాన్ని తగ్గించి, వేగవంతమైన న్యాయం అందించడంలో మధ్యవర్తిత్వం (మెడియేషన్) కీలక పాత్ర పోషిస్తుందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె. లక్ష్మణ్ అన్నారు. ఎంజీ యూనివర్సిటీలో న్యాయవాదుల శిక్షణ తరగతులు ప్రారంభిస్తూ ఆయన మాట్లాడారు. మధ్యవర్తిత్వం ద్వారా కోర్టు బయటే తక్కువ ఖర్చుతో, సంబంధాలు కాపాడుతూ పరిష్కారం పొందవచ్చని సూచించారు. న్యాయవాదులు శిక్షణను సద్వినియోగం చేసుకోవాలన్నారు.


