News February 10, 2025
మన్యంకొండ బ్రహ్మోత్సవాలు.. స్వామివారి హంస వాహన సేవ

పాలమూరు జిల్లాలో ప్రసిద్ధి చెందిన మన్యంకొండ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 3వ రోజు మాఘశుద్ధ ద్వాదశి ఆదివారం రాత్రి స్వామివారు హంస వాహనంపై విహరించారు. సతీ సమేతంగా హంస వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇచ్చారు. భక్తుల్లో నెలకొన్న అహంభావాన్ని తొలగించి జ్ఞాన సిద్ధి, బ్రహ్మ పాద ప్రాప్తి కలిగించేందుకు స్వామివారు హంస వాహనాన్ని అధిరోహిస్తాడని పురాణాలు చెబుతున్నాయి.
Similar News
News October 20, 2025
వంటింటి చిట్కాలు

* ఉప్పు నిల్వ చేసే డబ్బాలో అడుగున బ్లాటింగ్ పేపర్ వేస్తే.. ఉప్పు తేమగా మారదు.
* అల్లం, వెల్లుల్లి ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే.. కాగితంలో చుట్టి ఫ్రిజ్లో ఉంచాలి.
* కొత్త బంగాళదుంపలు ఉడికించేటప్పుడు నాలుగు పుదీనా ఆకులు వేస్తే మట్టి వాసన రాదు.
* కరివేపాకు పొడి చేసేటప్పుడు అందులో వేయించిన నువ్వుల పొడి వేస్తే మరింత రుచిగా ఉంటుంది.
News October 20, 2025
‘చందన బ్రదర్స్’ అధినేత కన్నుమూత

చందన బ్రదర్స్ వ్యవస్థాపకుడు చందన మోహన్రావు(82) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ ఉదయం విశాఖలో తుదిశ్వాస విడిచారు. సరసమైన ధరలకు నాణ్యమైన వస్త్రాలు, ఫర్నీచర్, జువెలరీ అందించే లక్ష్యంతో 1971లో చందన బ్రదర్స్ సంస్థను ఆయన ప్రారంభించారు. దూరదృష్టితో తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ రిటైల్ సంస్థగా నిలిపారు.
News October 20, 2025
కుల, మతాంతర వివాహితుల రక్షణ చట్టం రావాలి: జాన్వెస్లీ

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా గెర్రె గ్రామంలో జరిగిన కుల దురహంకార హత్యను సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ తీవ్రంగా ఖండించారు. కాచిగూడలో ఆయన మాట్లాడారు. బాధిత కుటుంబానికి న్యాయం చేసి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం కఠినచర్యలు తీసుకోవాలని, కుల, మతాంతర వివాహితుల రక్షణచట్టం తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు.