News February 10, 2025
మన్యంకొండ వెంకటేశ్వర స్వామి హంస వాహన సేవ

పాలమూరు జిల్లాలో ప్రసిద్ధి చెందిన మన్యంకొండ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 3వ రోజు మాఘశుద్ధ ద్వాదశి ఆదివారం రాత్రి స్వామివారు హంస వాహనంపై వివరించారు. సతీ సమేతంగా హంస వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇచ్చారు. భక్తుల్లో నెలకొన్న అహంభావాన్ని తొలగించి జ్ఞాన సిద్ధి, బ్రహ్మ పాద ప్రాప్తి కలిగించేందుకు స్వామివారు హంస వాహనాన్ని అధిరోహిస్తాడని పురాణాలు చెబుతున్నాయి.
Similar News
News November 11, 2025
మంగళవారం రోజున ఇలా చేయకపోవడం ఉత్తమం

మంగళవారం హనుమంతుడికి ఎంతో ప్రీతిపాత్రమైనది. ఈరోజు మద్యం, మాంసాహారం, మత్తు పదార్థాలు సేవించకపోవడం ఉత్తమమని పండితులు చెబుతున్నారు. మంగళ దోషం తొలగిపోయే ఈరోజున బిచ్చగాళ్లు, పేదలు, వికలాంగులు, వృద్ధులను అవమానించకూడదని అంటున్నారు. ‘తల్లి, సోదరి, భార్య సహా స్త్రీలను దైవస్వరూపంగా భావించాలి. శివుడిని గౌరవించాలి. శివపూజలు చేయాలి. ఈ నియమాలు పాటిస్తే ఆంజనేయుడు తప్పక అనుగ్రహిస్తాడు’ అని సూచిస్తున్నారు.
News November 11, 2025
ఢిల్లీ పేలుడు వెనుక ఉగ్ర కుట్ర!

ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో <<18253113>>పేలుడు<<>>పై కొత్వాలి పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఉగ్రదాడిగా అనుమానిస్తూ ఉపా చట్టం సెక్షన్ 16, 18 కింద రిజిస్టర్ చేసినట్లు వెల్లడించారు. మరోవైపు పేలుడు నేపథ్యంలో పలు దేశాల ఎంబసీలు అప్రమత్తమయ్యాయి. ఎర్రకోట పరిసరాల్లో ఉండొద్దని తమ దేశ పౌరులకు భారత్లోని యూఎస్, ఫ్రాన్స్ ఎంబసీలు అడ్వైజరీ జారీ చేశాయి.
News November 11, 2025
వనపర్తి నుంచి అరుణాచలేశ్వరుడి గిరి ప్రదక్షిణకు ప్రత్యేక బస్సు

వనపర్తి డిపో నుంచి అరుణాచలేశ్వరుడి గిరి ప్రదక్షిణ కోసం ఈనెల 15న రాత్రి 8 గంటలకు సూపర్ లగ్జరీ బస్సు బయలుదేరుతుందని డిపో మేనేజర్ దేవేందర్ గౌడ్ తెలిపారు. ఈ యాత్రలో కాణిపాకం, వేలూరులోని మహాలక్ష్మి అమ్మవారి దర్శనం ఉంటుందని పేర్కొన్నారు. ప్రదక్షిణ పూర్తయిన తర్వాత ఈనెల 18న బస్సు తిరిగి వనపర్తికి చేరుకుంటుంది. వివరాలకు 7382829379 నంబరులో సంప్రదించవచ్చు.


