News February 10, 2025
మన్యంకొండ వెంకటేశ్వర స్వామి హంస వాహన సేవ

పాలమూరు జిల్లాలో ప్రసిద్ధి చెందిన మన్యంకొండ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 3వ రోజు మాఘశుద్ధ ద్వాదశి ఆదివారం రాత్రి స్వామివారు హంస వాహనంపై విహరించారు. సతీ సమేతంగా హంస వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇచ్చారు. భక్తుల్లో నెలకొన్న అహంభావాన్ని తొలగించి జ్ఞాన సిద్ధి, బ్రహ్మ పాద ప్రాప్తి కలిగించేందుకు స్వామివారు హంస వాహనాన్ని అధిరోహిస్తాడని పురాణాలు చెబుతున్నాయి.
Similar News
News March 22, 2025
ఏలూరు: ఆరేళ్ల తర్వాత సంచలన తీర్పు

కామవరపుకోట(M) గుంటుపల్లి బౌద్ధాలయాల వద్ద 2019లో ప్రేమజంటపై దాడి జరిగింది. ఈక్రమంలో ఇంటర్ యువతిని హత్య చేశారు. కృష్ణా(D) జి.కొండూరుకు చెందిన రాజు(28), ద్వారకాతిరుమల(M) జి.కొత్తపల్లికి చెందిన సోమయ్య(22), గంగయ్య(20), నందివాడ(M) అరిశెల గ్రామానికి చెందిన నాగరాజును నిందితులుగా గుర్తించారు. వీరికి జీవిత ఖైదు విధిస్తూ పోక్సో కోర్టు జడ్జి సుమా సునంద తీర్పుఇచ్చారని ఏలూరు SP ప్రతాప్ శివకిషోర్ వెల్లడించారు.
News March 22, 2025
నేడు డీలిమిటేషన్‌పై అఖిలపక్ష సమావేశం

తమిళనాడులో అధికార డీఎంకే అధ్యక్షతన డీలిమిటేషన్‌పై నేడు అఖిల పక్ష సమావేశం జరగనుంది. ఇప్పటికే CM రేవంత్, PCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR చెన్నై చేరుకున్నారు. వారికి అక్కడి ఎయిర్‌పోర్టులో ఘనస్వాగతం లభించింది. చెన్నైలోని ఐటీసీ చోళ హోటల్‌లో ఈరోజు ఉదయం 10.30 నుంచి ఒంటిగంట వరకు ఈ సమావేశం జరగనుంది. అనంతరం నేతలందరూ కలిసి సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించే అవకాశం ఉంది.
News March 22, 2025
మహాదేవపూర్: అకాల వర్షం.. అపార నష్టం

మహాదేవపూర్ మండలంలోని పలు గ్రామాల్లో రాత్రి గాలులతో కూడిన వర్షం కురవడంతో కల్లాల్లో ఆరబెట్టిన మిర్చి పంట తడిసిపోయింది. దీంతో చేతికొచ్చిన పంటను కాపాడుకోవడానికి తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకుండా పోయిందని రైతులు కన్నీటి పర్యంతం అయ్యారు. తడిసిన పంటను చూసి రైతులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షం తమను నిండా ముంచిందని, నష్టపోయిన తమను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని మిర్చి రైతులు కోరుతున్నారు.