News February 10, 2025
మన్యంకొండ వెంకటేశ్వర స్వామి హంస వాహన సేవ

పాలమూరు జిల్లాలో ప్రసిద్ధి చెందిన మన్యంకొండ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 3వ రోజు మాఘశుద్ధ ద్వాదశి ఆదివారం రాత్రి స్వామివారు హంస వాహనంపై విహరించారు. సతీ సమేతంగా హంస వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇచ్చారు. భక్తుల్లో నెలకొన్న అహంభావాన్ని తొలగించి జ్ఞాన సిద్ధి, బ్రహ్మ పాద ప్రాప్తి కలిగించేందుకు స్వామివారు హంస వాహనాన్ని అధిరోహిస్తాడని పురాణాలు చెబుతున్నాయి.
Similar News
News March 27, 2025
భద్రాద్రి: జిల్లాలో కాంగ్రెస్ ప్రక్షాళన జరుగుతుందా?

కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ పార్టీని మరింత బలోపేతం చేయడంపై ఫోకస్ పెట్టారు. 18 ఏళ్ల తర్వాత జిల్లా కాంగ్రెస్ కమిటీలతో నేడు ఢిల్లీలో మీటింగ్ పెట్టనున్నారు. ఇందులో భాగంగా జిల్లా, బ్లాక్, మండల కాంగ్రెస్ అధ్యక్షుల ఎంపిక ఉంటుందని టాక్. KTDM జిల్లా డీసీసీ చీఫ్‌గా పోదెం వీరయ్య ఉన్నారు. అయితే ఈ పదవి కోసం కాంగ్రెస్ సీనియర్ నేతలు చాలామంది పోటీపడుతున్నారు. ఈ పదవి ఎవరికి దక్కుతుందో చూడాలి మరి.
News March 27, 2025
వరంగల్ : బైకును ఢీ కొట్టిన లారీ.. బాలుడు మృతి

వరంగల్ జిల్లా సంగెం మండలం గవిచర్లలో విషాదం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. బైకుపై వెళ్తున్న యువకుడిని లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. గవిచర్లకి చెందిన గాలి చందు (17) బైక్‌పై ఆశాలపల్లి వైపు వెళ్తున్నాడు. ఈ క్రమంలో కంటైనర్ లారీ ఢీకొట్టడంతో చందు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
News March 27, 2025
వనపర్తి జిల్లాలో మండుతున్న ఎండలు..!

వనపర్తి జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. అత్యధికంగా కనాయిపల్లిలో 40.9℃ ఉష్ణోగ్రత నమోదైంది. రేమద్దుల 39.8, కేతేపల్లి 39.7, పెబ్బేరు, వెల్గొండ 39.6, గోపాలపేట 39.4, దగడ 39.3, విలియంకొండ 39.2, విపనగండ్ల 39.1, శ్రీరంగాపురం, పంగల్ 39, జనంపేట, ఆత్మకూర్ 38.9, రేవల్లి 38.8, వనపర్తి 38.7, మదనాపురం 38.6, సోలిపూర్ 38.4, పెద్దమందడి 38.1, ఘనపూర్ 37.9, అమరచింతలో 37.7℃ ఉష్ణోగ్రత నమోదైంది.