News March 13, 2025
మన్యంకొండ శ్రీ అలివేలు మంగ అమ్మవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

మన్యంకొండ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగినట్టుగానే, గుట్ట కింద వెలసిన శ్రీ అలవేలు మంగమ్మ అమ్మవారికి పాల్గుణ మాసంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ కార్యక్రమంలో భాగంగా అంకురార్పణకు బుధవారం పుట్ట మట్టిని అర్చకులు శాస్త్రోక్తంగా ఆలయానికి తీసుకువచ్చారు. నవధాన్యాలను పుట్టమట్టిలో వేసి అంకురార్పణకు శ్రీకారం చుట్టారు. విత్తనాలు మొలకెత్తడాన్ని అంకురార్పణం అంటారు.
Similar News
News December 2, 2025
పాలమూరు: ఎన్నికల నిబంధనలను తప్పకుండా పాటించాలి

సర్పంచ్, వార్డ్ మెంబర్స్, ఓటర్లు ప్రతి ఒక్కరూ ఎన్నికల నిబంధనల ప్రకారం ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు తమ పోలీస్ అధికారులకు సహకరించాలని ఎస్పీ జానకి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎలాంటి సమస్యలు వచ్చిన తమ పోలీస్ అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా వ్యవహరిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News December 2, 2025
రేపటి నుంచి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

దేవరకద్ర మండలం చిన్నరాజమూర్ గ్రామంలోని ఆంజనేయస్వామి దేవాలయంలో మంగళవారం నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయని ఈవో శ్యాంసుందర్ సోమవారం తెలిపారు. దాదాపు 5 రోజులు ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు. అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, ఎక్కడ భక్తులకు ఇబ్బంది కలగకుండా చూసేలా తగు చర్యలు తీసుకున్నామన్నారు. డిసెంబర్ 6వ తేదీన బ్రహ్మోత్సవాలు ముగుస్తాయన్నారు.
News December 1, 2025
MBNR: మహిళలను వేధిస్తే 8712659365 కాల్ చేయండి

పనిచేసే ప్రదేశంలో, విద్యార్థులు చదువుకునే ప్రాంతాలలో ఎవరైనా మహిళలను వేధిస్తే వెంటనే 8712659365 నంబర్‌కు కాల్ చేయాలని జిల్లా ఎస్పీ జానకి తెలిపారు. ఎల్లప్పుడూ మహిళల రక్షణ కోసం తమ షీ టీం బృందం పనిచేస్తుందని పేర్కొన్నారు. సమాచారం అందించిన వారి వ్యక్తిగత విషయాలను గోప్యంగా ఉంచుతామని సూచించారు. విద్యార్థినీలకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.


