News February 20, 2025
మన్యంకొండ హుండీ ఆదాయం రూ.32,39,301

మన్యంకొండ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి హుండీలను బుధవారం ఆలయ అధికారులు లెక్కించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు లెక్కింపు కొనసాగింది. ఆలయం నిర్వహణ అధికారి శ్రీనివాసరాజు పర్యవేక్షణలో లెక్కింపు చేపట్టారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారి హుండీ ఆదాయం రూ.32,39,301 వచ్చినట్లు ఆలయ ధర్మకర్త అళహరి మధుసూదన్ కుమార్ తెలిపారు.
Similar News
News March 16, 2025
‘పుష్ప-3’ రిలీజ్ అయ్యేది అప్పుడే: నిర్మాత

‘పుష్ప-3’ సినిమాను 2028లో రిలీజ్ చేస్తామని మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత రవిశంకర్ వెల్లడించారు. విజయవాడలో జరిగిన ‘రాబిన్ హుడ్’ ప్రెస్‌మీట్‌లో ఆయన పాల్గొన్నారు. అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ డైరెక్షన్‌లో సినిమా చేస్తున్నారని తెలిపారు. సుకుమార్ దర్శకత్వంలో 2021లో వచ్చిన పుష్ప, 2024లో రిలీజైన ‘పుష్ప-2’ సూపర్ హిట్‌లుగా నిలవగా, ‘పుష్ప-2’ రూ.1800 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన సంగతి తెలిసిందే.
News March 16, 2025
భూమిపైకి సునీతా విలియమ్స్.. ఎప్పుడంటే

వారం రోజుల మిషన్‌పై వెళ్లి 9 నెలల పాటు అంతరిక్షంలో చిక్కుకుపోయిన సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్ భూమిపై అడుగు పెట్టే సమయం ఆసన్నమైంది. వాతావరణం అనుకూలిస్తే ఈ నెల 19న భూమికి తిరిగి రానున్నారు. వీరు ప్రయాణించే డ్రాగన్ క్యాప్సూల్ అమెరికాలోని ఫ్లోరిడా తీరంలో ల్యాండ్ కానుంది. దీంతో వ్యోమగాములిద్దరూ క్షేమంగా తిరిగిరావాలని ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది కోరుకుంటున్నారు.
News March 16, 2025
FRO స్క్రీనింగ్ టెస్ట్.. 70.85% హాజరు

AP: రాష్ట్ర అటవీశాఖలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి ఇవాళ నిర్వహించిన స్క్రీనింగ్ టెస్ట్ ప్రశాంతంగా ముగిసిందని APPSC ప్రకటించింది. 70.85% హాజరు నమోదైందని వెల్లడించింది. ఈ పరీక్ష కోసం 15,308 మంది దరఖాస్తు చేసుకోగా, 10,755 మంది హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారని తెలిపింది. 7,620 మంది పరీక్షకు హాజరైనట్లు పేర్కొంది.