News February 20, 2025
మన్యంకొండ హుండీ ఆదాయం రూ.32,39,301

మన్యంకొండ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి హుండీలను బుధవారం ఆలయ అధికారులు లెక్కించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు లెక్కింపు కొనసాగింది. ఆలయం నిర్వహణ అధికారి శ్రీనివాసరాజు పర్యవేక్షణలో లెక్కింపు చేపట్టారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారి హుండీ ఆదాయం రూ.32,39,301 వచ్చినట్లు ఆలయ ధర్మకర్త అళహరి మధుసూదన్ కుమార్ తెలిపారు.
Similar News
News October 30, 2025
గుడికి వెళ్తే ప్రశాంతత ఎందుకు లభిస్తుందంటే..?

ఆలయాలను అయస్కాంత శక్తి అధికంగా ఉన్న స్థలాల్లో నిర్మిస్తారు. అయస్కాంత క్షేత్రం కేంద్ర స్థానాన్ని ఎంచుకుని అక్కడ మూల విరాట్టును ప్రతిష్ఠిస్తారు. దీనివల్ల ఆ శక్తి విగ్రహం ద్వారా భక్తుల శరీరం, మనసులోకి చేరుతుంది. క్షేత్రంలో కొంత సమయం గడపడం వల్ల అది మనలోని ప్రతికూలతలను తగ్గిస్తుంది. అందుకే గుడికి వెళ్తే మనకు ప్రశాంతంగా అనిపిస్తుంది. కష్టాల నుంచి గట్టెక్కడానికి కావాల్సిన ఆత్మవిశ్వాసం లభిస్తుంది.
News October 30, 2025
‘అదునెరిగి సేద్యం, పదునెరిగి పైరు’

సమయం చూసి వ్యవసాయం చేయాలి. అంటే, వాతావరణ పరిస్థితులు, భూమి స్వభావం, నీటి లభ్యత వంటి అంశాలను పరిశీలించి సాగును ప్రారంభించాలి. భూమికి, వాతావరణానికి అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే పంటను వెయ్యాలి. సమయం దాటితే పంట చేతికి రాదు, శ్రమ కూడా వృథా అవుతుంది. అలాగే ఏ పనిలోనైనా విజయం సాధించాలంటే సమయాన్ని సరిగ్గా అంచనా వేసి, సరైన ప్రణాళికతో ముందుకు వెళ్లాలని చెప్పడం ఈ సామెత ఉద్దేశం.
News October 30, 2025
నెల్లూరు: హాస్టల్ విద్యార్థులకు బెడ్ షీట్లు

నెల్లూరు జిల్లాలోని ప్రభుత్వ హాస్టల్ విద్యార్థులకు బెడ్ షీట్లు వచ్చాయి. 3,585 కార్పెట్లు, 3,854 బెడ్ షీట్స్ సరఫరా చేసినట్లు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ& సాధికారత అధికారిణి పి.వెంకటలక్ష్మమ్మ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 43 బీసీ హాస్టళ్లకు వీటిని పంపిణీ చేసినట్లు చెప్పారు.


