News March 20, 2025

మన్యంకొండ హుండీ ఆదాయం రూ.35.26 లక్షలు

image

మన్యంకొండ శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈ ఏడాది బ్రహ్మోత్సవాలు ముగిసిన తర్వాత బుధవారం 2వసారి హుండీ లెక్కించారు. భక్తులు కానుకల రూపంలో సమర్పించిన సొమ్ము మొత్తం రూ.35,26,085 ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో దేవస్థానం ఛైర్మన్ అళహరి మధుసూదన్ కుమార్, అళహరి రామకృష్ణ, ఈవో శ్రీనివాసరాజు, సహాయ కమిషనర్ మదనేశ్వర్, సూపరింటెండెంట్ నిత్యానంద చారి, IDBC మేనేజర్ నీలకంఠ పాల్గొన్నారు.

Similar News

News March 28, 2025

MBNR: Way2News కథనానికి స్పందించిన అధికారులు

image

మహబూబ్‌నగర్ జిల్లా కోయిల్‌కొండ మండలంలో కొందరు అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని Way2Newsతో గురువారం ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. కోయిల్‌కొండ ఎమ్మార్వో, ఎస్ఐ వచ్చి ఊరు బయట నిల్వ ఉంచిన ఇసుకను సీజ్ చేశారు. వారికి గ్రామస్థులు థ్యాంక్స్ తెలిపారు. అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని గ్రామ యువకులు డిమాండ్ చేశారు.  

News March 28, 2025

పాలమూరు: పేదింటి బిడ్డ.. సెంట్రల్ GOVT జాబ్ సాధించారు..!

image

ఆయన పేదింటి యువకుడు.. తల్లిదండ్రుల కష్టం చూసిన అతడు GOVT స్కూల్‌లో చదువుతూనే ఎలాగైనా ఉన్నత స్థానానికి ఎదగాలని నిశ్చయించుకున్నారు. కష్టపడి చదివి సొంతంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వ నావికాదళంలో జాబ్ సాధించారు.ఆయనే వనపర్తి జిల్లా అమరచింత మండలం మస్తిపురం గ్రామ యువకుడు అశోక్.. తమ స్కూల్ పూర్వ విద్యార్థి అశోక్ జాబ్ కొట్టడం అభినందనీయమని మస్తిపురం ZPHS HMవెంకటన్న ఆయనను సన్మానించారు.

News March 27, 2025

మహబూబ్‌నగర్‌లో ముమ్మరంగా రంజాన్ ఏర్పాట్లు

image

రంజాన్ పండుగను పురస్కరించుకుని మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని వాగు గుట్ట వద్ద మైనార్టీ సోదరులు ప్రార్థనలు చేసుకునేందుకు వీలుగా నిర్వహిస్తున్న ఏర్పాట్లను మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్, ముడా ఛైర్మన్ లక్ష్మణ్ యాదవ్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లైట్లు, కూలర్ల ఏర్పాటు విషయంలో ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదు అన్నారు. కార్యక్రమంలో నాయకుడు సిరాజ్ ఖాద్రి తదితరులు పాల్గొన్నారు.

error: Content is protected !!