News March 20, 2025

మన్యంకొండ హుండీ ఆదాయం రూ.35.26 లక్షలు

image

మన్యంకొండ శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈ ఏడాది బ్రహ్మోత్సవాలు ముగిసిన తర్వాత బుధవారం 2వసారి హుండీ లెక్కించారు. భక్తులు కానుకల రూపంలో సమర్పించిన సొమ్ము మొత్తం రూ.35,26,085 ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో దేవస్థానం ఛైర్మన్ అళహరి మధుసూదన్ కుమార్, అళహరి రామకృష్ణ, ఈవో శ్రీనివాసరాజు, సహాయ కమిషనర్ మదనేశ్వర్, సూపరింటెండెంట్ నిత్యానంద చారి, IDBC మేనేజర్ నీలకంఠ పాల్గొన్నారు.

Similar News

News October 30, 2025

532 పోస్టులు… అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్(UCO)లో 532 అప్రెంటిస్‌లకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. ఏదైనా డిగ్రీ పాసై 20- 28ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. మొత్తం పోస్టుల్లో APలో 7, TGలో 8 ఖాళీలున్నాయి. రాత పరీక్ష, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. అభ్యర్థులు ముందుగా NATS పోర్టల్‌లో ఎన్‌రోల్ చేసుకోవాలి. వెబ్‌సైట్: uco.bank.in/

News October 30, 2025

ధ్వజస్తంభం విశేషాలివే..

image

ధ్వజస్తంభాన్ని దర్శించిన తర్వాతే మూల విరాట్టును చూడాలంటారు. అంతటి ప్రాధాన్యం దీనికుంది. ఆలయ నిర్మాణంలో ఇది అత్యంత ముఖ్యమైన భాగం. ఆలయమనే దేహానికి గర్భాలయాన్ని ముఖంగా, ధ్వజస్తంభాన్ని హృదయంగా భావిస్తారు. విగ్రహ ప్రతిష్ఠతో సమానంగా దీనిని ప్రతిష్ఠిస్తారు. ధ్వజస్తంభానికి కూడా దీపారాధనలు, ఉపచారాలు చేస్తారు. ఆలయ ద్వారాలు మూసి ఉన్నా, ధ్వజస్తంభ దర్శనంతో దైవదర్శన ఫలితం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.

News October 30, 2025

సిద్దిపేట: నమ్మించి గర్భవతిని చేసిన వ్యక్తి 20ఏళ్ల జైలు

image

పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించి అత్యాచారం చేసిన కేసులో నిందితునికి 20 ఏళ్లు జైలు శిక్ష, రూ.1,20,000 జరిమాన విధిస్తూ సెషన్స్ కోర్టు జడ్జి జయ ప్రసాద్ తీర్పు ఇచ్చినట్టు సిద్దిపేట సీపీ విజయ్ కుమార్ తెలిపారు. చిన్నకోడూరు మండలం చౌడరం వాసి మహేందర్ రెడ్డి అదే గ్రామానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఆమెకు దగ్గరై గర్భవతిని చేసిన అతడు చివరకు పెళ్లికి నిరాకరించడంతో కేసు నమోదైంది.