News December 20, 2024

మన్యం అందాలను ‘క్లిక్’మనిపించిన పవన్

image

ఉమ్మడి విజయనగరం జిల్లాలోని ప్రకృతి అందాలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫిదా అయ్యారు. సాలూరు నియోజకవర్గం బాగుజోల గ్రామంలో పర్యటనలో భాగంగా వెంగళరాయ సాగర్ ప్రాంతంలో కారు దిగి నడుచుకొంటూ కొంత దూరం వెళ్ళారు. అక్కడి ప్రకృతి అందాలను తన సెల్‌ఫోన్లో బంధించారు. బాగుజోలలో పలుమార్లు మన్యం అందాల గురించి మాట్లాడుతూ.. ఇక్కడ ప్రజలు అదృష్టవంతులని.. ప్రకృతి అందాలు తన మనసును కట్టి పడేస్తున్నాయని అన్నారు.

Similar News

News November 7, 2025

వెయ్యిమందికి తక్కువ కాకుండా ఉపాధి ప‌ని: VZM కలెక్టర్

image

ప్రతి మండలంలో కనీసం వెయ్యిమందికి తక్కువ కాకుండా ఉపాధి పనులు కల్పించాల‌ని కలెక్టర్ రాం సుందర్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. MNREGS పథకం అమలుపై శుక్రవారం టెలికాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. తక్కువ ప్రగతి ఉన్న మండలాలపై దృష్టి సారించాలని సూచించారు. వచ్చే వారం నాటికి 20% పనులు ప్రారంభించాలని, సగటు వేతనాన్ని పెరిగేలా చూడాలని కలెక్టర్ పేర్కొన్నారు.పనికల్పనలో వెనుకబడిన మండలాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

News November 7, 2025

‘కూటమిగా పోరాడదాం.. మెంటాడను సాధిద్దాం’

image

మెంటాడ మండలాన్ని విజయనగరం జిల్లాలో కొనసాగించేకు ఉమ్మడిగా పోరాడాలని జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు అన్నారు. శుక్రవారం ఎంపీడీవో కార్యాలయంలో టీడీపీ, వైసీపీ, బీజేపీ, జనసేన నాయకులు సమావేశం అయ్యారు. మెంటాడ మండలం పార్వతీపురం జిల్లాలో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. త్వరలో మండల ప్రజల అభిప్రాయాలను ముఖ్యమంత్రి, సంబంధిత మంత్రులకు తెలియజేస్తామన్నారు.

News November 7, 2025

VZM: ‘మాతృ, శిశు మరణాలు జరగకుండ చర్యలు అవసరం’

image

జిల్లాలో మాతృ, శిశు మరణాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యాధికారి డా. ఎస్. జీవనరాణి వైద్య సిబ్బందికి ఆదేశించారు. గురువారం తన కార్యాలయంలో సిబ్బందితో కమిటీ సమావేశం నిర్వహించారు. గత నెలలో జరిగిన 3 మాతృ మరణాలు, 6 శిశు మరణాలకు గల కారణాలను విశ్లేషించాలని సూచించారు. మాతృ, శిశు మరణాల సంభవించకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.