News February 26, 2026

మన్యం: గుర్తుతెలియని వాహనం ఢీకొని ఆర్మీ జవాన్ మృతి

image

గరుగుబిల్లి మండలం గిజబ గ్రామ సమీపంలో ప్రధాన రహదారి వద్ద గురువారం ఉదయం గుర్తుతెలియని వాహనం బైక్‌ను ఢీకొనడంతో బైకిస్ట్ అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు జియ్యమ్మవలస మండలం శిఖబడి గ్రామానికి చెందిన ఆర్మీ ఉద్యోగి దవలసింగి చంద్రమౌళి (29)గా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News April 16, 2026

నారాయణపేట: జీతాలు ఇవ్వకుంటే విధుల బహిష్కరణ

image

నాలుగు నెలలుగా పెండింగ్‌లో ఉన్న జీతాలను విడుదల చేయాలని కోరుతూ నారాయణపేట జిల్లా సాంకేతిక సహాయకుల జేఏసీ ప్రతినిధులు జిల్లా డీఆర్డివో మొగులప్పకు వినతిపత్రం అందజేశారు. వేతనాలు రాకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోతే మంగళవారం నుంచి పెన్‌డౌన్ నిర్వహిస్తామని జిల్లా నాయకులు హర్షవర్ధన్,గౌరీశంకర్, ఊషన్న, శంకర్ తెలిపారు.

GNT: కూలీ కూతురు 990 మార్కులతో ప్రతిభ

image

గుంటూరు (D) రేవేంద్రపాడు కొత్తపాలెంకు చెందిన పుప్పాల కనకమహాలక్ష్మి పేదరికాన్ని జయించి ఆదర్శంగా నిలిచింది. కూలీ పనులకు వెళ్లే తల్లిదండ్రుల కష్టాన్ని చూసి పట్టుదలతో చదివిన ఆమె, ఇంటర్ బైపీసీలో 990 మార్కులు సాధించి రికార్డు సృష్టించింది. మల్లె తోటలో కూలీకి వెళ్లే తల్లి, బస్తాలు మోసే తండ్రికి తన విజయంతో తీపి కబురు అందించింది. ఆమె కృషిని గ్రామస్థులు, విద్యావేత్తలు ప్రశంసిస్తున్నారు.