News April 18, 2024
మన్యం జిల్లాలో ఎన్నికలకు అంతా సిద్ధం: జిల్లా కలెక్టర్
జిల్లాలో ఎన్నికల నిర్వహణకు అంతా సిద్ధంగా ఉన్నామని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. జిల్లాలో మొత్తం 342 ఫిర్యాదులు అందాయని అందులో 171 ఫిర్యాదులు ఎన్నికల కమిషన్ పోర్టల్‌లో నమోదయ్యాయని, వాటిలో 166 పరిష్కరించామని తెలిపారు. సి-విజిల్ లో 91 ఫిర్యాదులు అందగా వాటన్నిటినీ పరిష్కరించామన్నారు. జిల్లాలో మొత్తం రూ.83 లక్షల విలువ కలిగిన మద్యం, గంజాయి, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
Similar News
News September 14, 2024
పైడితల్లి అమ్మవారి ఉత్సవాల ఏర్పాట్లపై సమీక్ష సమావేశం
విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమాను ఉత్సవాల నిర్వహణపై శనివారం ఉదయం 11 గంగలకు కలెక్టరేట్‌లో సమీక్షా సమావేశం జరగనుంది. రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. అక్టోబర్ 15న అమ్మవారి సిరిమాను సంబరం జరగనున్న నేపథ్యంలో పండగ ఏర్పాట్లపై అధికారులతో మంత్రి సమీక్షించనున్నారు. జిల్లా కలెక్టర్, ఆలయ అధికారులు, రెవెన్యూ, మున్సిపల్ శాఖ అధికారులు ఈ సమావేశానికి హాజరవుతారు.
News September 13, 2024
VZM: నర్సింగ్ చేసిన వారికి గుడ్ న్యూస్
ANM, GNM,BSC నర్సింగ్ చదివిన వారికి జపనీస్ భాష నేర్పించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి గోవిందరావు తెలిపారు. ఆరు నెలల శిక్షణ కోసం రూ.3.50 లక్షలు చెల్లించాలని, రిజిస్ట్రేషన్ ఫీజు రూ.50వేలు ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు.శిక్షణ అనంతరం జపాన్ దేశంలో నెలకు రూ.లక్ష దాటి జీతం పొందవచ్చన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు https://shorturl.at/FB7ok వెబ్ సైట్ నందు నమోదు చేసుకోవాలన్నారు.
News September 13, 2024
VZM: రాష్ట్రస్థాయి యోగాసనాలకు 30 మంది ఎంపిక
49వ రాష్ట్రస్థాయి యోగాసన పోటీలకు 30 మంది క్రీడాకారులు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా జిల్లా యోగా అసోసియేషన్ అధ్యక్షుడు అవనాపు విక్రమ్ శుక్రవారం జరిగిన కార్యక్రమంలో క్రీడాకారులను అభినందించారు. క్రీడాకారులు తమ ప్రతిభను చాటి, జాతీయస్థాయి పోటీలకు ఎంపిక కావాలని ఆకాంక్షించారు. యోగా క్రీడా శరీరానికి, మానసిక ఎదుగుదలకు ఎంతో ఉపయోకరమని, అందుకే దేశ ప్రధాని మోదీ సైతం ఈ క్రీడను ప్రోత్సహిస్తున్నారని తెలిపారు.