News May 4, 2024
మన్యం: జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్
భారత ఎన్నికల కమీషన్ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పార్వతీపురం మన్యం జిల్లా నుంచి జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎస్పీ విక్రాంత్ పాటిల్, పార్లమెంటరీ నియోజకవర్గ సాధారణ పరిశీలకులుగా ప్రమోద్ కుమార్, పార్లమెంటరీ నియోజకవర్గ పోలీస్ పరిశీలకులు నయీం ముస్తఫా మన్సూరి, తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో చేపట్టిన ఎన్నికల ఏర్పాట్లను, పర్యవేక్షణను వివరించారు.
Similar News
News November 8, 2024
బడి బయట 10వేల మంది: కలెక్టర్ కీలక ఆదేశాలు
జిల్లాలో బడిబయట ఉన్న పిల్లలు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారో, ఏం చేస్తున్నారో విద్యార్థి వారీగా నివేదిక రూపొందించాలని కలెక్టర్ అంబేడ్కర్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. విద్యాశాఖాధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఉన్న విద్యార్థుల సంఖ్య దృష్ట్యా సుమారు పదివేల మంది బడి బయట ఉండవచ్చని డీఈఓ తెలిపారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ వారిపై అధ్యయనం చేయాలని ఆదేశించారు.
News November 7, 2024
పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష
విజయనగరానికి చెందిన కుమిలి సురేశ్‌కు పోక్సో ప్రత్యేక న్యాయమూర్తి నాగమణి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చినట్లు SP వకుల్ జిందాల్ గురువారం తెలిపారు. ఓ బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి తరచూ అత్యాచారానికి పాల్పడ్డాడనే ఫిర్యాదుతో స్థానిక మహిళా పోలీసు స్టేషన్లో 2021లో పోక్సో కేసు నమోదు అయ్యిందని తెలిపారు. దీనిపై దర్యాప్తు చేపట్టగా నేరం రుజువు కావడంతో పై విధంగా తీర్పు వెల్లడైందన్నారు.
News November 7, 2024
VZM: టూరిజం హోటల్స్ ఏర్పాటుపై IHCL బృందం పరిశీలన
విజయనగరం జిల్లాలో ఆతిథ్య రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు టాటా సంస్థకు చెందిన IHCL ఆసక్తి కనబరుస్తోంది. ఈ సంస్థ ప్రతినిధుల బృందం జిల్లాలో గురువారం పర్యటించి పలు ప్రాంతాల్లో పర్యాటక హోటల్స్ ఏర్పాటు కోసం స్థల పరిశీలన చేసింది. అనంతరం కలెక్టర్ అంబేడ్కర్‌ను కలెక్టరేట్లో కలిసి జిల్లాలో పర్యాటక రంగంలో పెట్టుబడులకు గల అవకాశాలపై చర్చించారు.