News March 4, 2025
మన్యం జిల్లా నేటి టాప్ న్యూస్

☞ పార్వతీపురానికి చినజీయర్ స్వామి రాక
☞ పుష్పశ్రీవాణికి వైరిచర్ల కౌంటర్
☞ శంబరలో తగ్గని భక్తుల రద్దీ
☞ మన్యం జిల్లా డీఆర్డీఏ పీడీగా సుధారాణి
☞ జిల్లాలో ఇంటర్ పరీక్షలకు 562మంది గైర్హాజరు
☞ భూ అక్రమాలపై ప్రత్యేక కమిటీ వేయండి: ఎమ్మెల్యే బోనెల
☞ అచ్చెన్న మాట మార్చారు: మజ్జి శ్రీను
Similar News
News December 2, 2025
తిరుపతి జిల్లాలో నకిలీ CI అరెస్ట్

తిరుపతి జిల్లా భాకరాపేటలో నకిలీ CI హల్‌చల్ చేశాడు. అన్నమయ్య జిల్లాకు చెందిన కురబోతుల శివయ్య అలియాస్ శివకుమార్(33) తాను కడప స్పెషల్ బ్రాంచ్ CIనని నమ్మబలికాడు. స్థానిక గొడవల్లో జోక్యం చేసుకుని బెదిరించాడు. ఒకరి దగ్గర బంగారు ఉంగరాన్ని కొట్టేశాడు. ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ కొందరి నుంచి డబ్బులు వసూలు చేశాడు. దీంతో అతడిని అరెస్ట్ చేశామని భాకరాపేట CI ఇమ్రాన్ బాషా వెల్లడించారు.
News December 2, 2025
GNT: స్పా ముసుగులో వ్యభిచారం..!

తెనాలిలో స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న వారిని త్రీ టౌన్ పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. సుల్తానాబాద్‌లోని తెనాలి–గుంటూరు రహదారిలో ఉన్న ఓ స్పాపై త్రీ టౌన్ సీఐ ఎస్. సాంబశివరావు, సిబ్బంది సోమవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. అక్కడ వ్యభిచారానికి పాల్పడుతున్న ఓ మహిళ, ఓ వ్యక్తి, మేనేజర్, స్పా నిర్వహకులను స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
News December 2, 2025
పార్వతీపురం: ‘పరిపాలనా యంత్రాంగం ఆరోగ్యం, శ్రేయస్సు ముఖ్యం’

జిల్లా పరిపాలనా యంత్రాంగం ఆరోగ్యం, శ్రేయస్సు తమకు ముఖ్యమని, అందుకే ఈ ప్రత్యేక వైద్య శిబిరమని జిల్లా డా.ఎన్.ప్రభాకరరెడ్డి పేర్కొన్నారు. సోమవారం పార్వతీపురంలోని కలెక్టరేట్ కార్యాలయ ప్రాంగణంలో వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. జిల్లా అభివృద్ధిలో పాలుపంచుకుంటున్న ప్రతి ఒక్క అధికారి, సిబ్బంది ఆరోగ్యం చాలా ముఖ్యమని అన్నారు. ఆరోగ్యవంతమైన సిబ్బంది మాత్రమే సమర్థవంతంగా పనిచేయగలుగుతారన్నారు.


