News March 4, 2025
మన్యం జిల్లా నేటి టాప్ న్యూస్

☞ పార్వతీపురానికి చినజీయర్ స్వామి రాక
☞ పుష్పశ్రీవాణికి వైరిచర్ల కౌంటర్
☞ శంబరలో తగ్గని భక్తుల రద్దీ
☞ మన్యం జిల్లా డీఆర్డీఏ పీడీగా సుధారాణి
☞ జిల్లాలో ఇంటర్ పరీక్షలకు 562మంది గైర్హాజరు
☞ భూ అక్రమాలపై ప్రత్యేక కమిటీ వేయండి: ఎమ్మెల్యే బోనెల
☞ అచ్చెన్న మాట మార్చారు: మజ్జి శ్రీను
Similar News
News March 25, 2025
బొబ్బిలిలో విషాదం.. అపార్ట్‌మెంట్‌పై నుంచి పడి రిటైర్డ్ HM మృతి

బొబ్బిలిలో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. నాయుడుకాలనీలో అపార్ట్మెంట్ పైనుంచి ప్రమాదవశాత్తూ జారిపడి రిటైర్డ్ హెచ్ఎం వై.శ్యామసుందర్(80) మృతి చెందారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బాల్కనీలో నిల్చున్న ఆయన కళ్లు తిరిగి పడిపోయారు. ఆయన స్వగ్రామం పాల్తేరు కాగా అదే గ్రామంలో HMగా రిటైర్ అయ్యారు. ఇద్దరు కుమారులు కాగా.. ఒకరు డాక్టర్‌గా, మరో కుమారుడు సచివాలయ ఉద్యోగిగా పనిచేస్తున్నారు.
News March 25, 2025
మేడ్చల్: బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకొని SUICIDE

క్రికెట్ బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకొని ఓ వ్యక్తి HYDలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మేడ్చల్ పోలీసుల సమాచారం.. మండల పరిధిలోని గుండ్ల పోచంపల్లికి చెందిన సోమేశ్ (29) క్రికెట్ బెట్టింగ్‌లో రూ.2 లక్షలు పోగొట్టుకొని మనోవేదనకు గురయ్యాడు. మంగళవారం గౌడవెల్లి పరిధిలో రైలు పట్టాలపై పడుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
News March 25, 2025
అచ్చంపేట: వేతనాలు లేక లైబ్రేరియన్ల అవస్థలు..!

జిల్లా గ్రంథాలయ శాఖల్లో పనిచేస్తున్న లైబ్రరియన్లకు మూడు నెలలుగా వేతనాలు రాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అచ్చంపేట లైబ్రేరియన్ శంకర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ముగ్గురు లైబ్రేరియన్లు, మరో 15 మంది పార్టీ వర్కర్లు, స్వీపర్లు పనిచేస్తున్నారు. జీతాలు రాకపోవడంతో కుటుంబ పోషణ భారమైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.