News June 8, 2024
మన్యం: ప్రతిష్ఠాత్మకంగా ప్రిజం -10 ప్రాజెక్ట్ అమలు
జిల్లాలో ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ప్రిజం -10 ప్రాజెక్ట్‌ను పరిశీలించేందుకు ఢిల్లీ నుంచి కమిటి జిల్లాకు శుక్రవారం వచ్చింది. క్షేత్ర స్థాయిలో అమలు చేస్తున్న పరిస్థితిని కమిటీ పరిశీలిస్తోంది. కమిటీ సభ్యులుగా డీఓపీటీ డైరెక్టర్ మొలాయ్ శాన్యాల్, బొగ్గు మంత్రిత్వ శాఖ డిప్యూటీ సెక్రటరీ ( సీపీడీ) సుదర్శన్ భగత్ జిల్లాకు చేరుకున్నారు. శనివారం గ్రామాల్లో పర్యటించనున్నారు.
Similar News
News November 28, 2024
VZM: పవన్ కళ్యాణ్ దృష్టికి ఏనుగుల సమస్య
ఉమ్మడి విజయనగరం జిల్లాతో పాటు శ్రీకాకుళం ఏజెన్సీ ప్రాంతాల్లో ఏనుగుల సమస్యను డిప్యూటీ సీఎం పవన్ దృష్టికి తీసుకువెళ్లానని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు. ఏనుగుల సంచారంతో పంటలు, ఆస్తులు ధ్వంసం కావడంతో పాటు జీవన భద్రతకు ముప్పు వాటిల్లుతుందని పవన్‌కు వివరించామన్నారు. ఏనుగుల కదలికలను గుర్తించి వాటిని సురక్షిత ప్రాంతాలకు తరలించేలా చర్యలు చేపట్టాలని ఢిల్లీలో కలిసి కోరినట్లు ఎంపీ తెలిపారు.
News November 28, 2024
బలిజిపేట: వ్యక్తి సూసైడ్.. అప్పుల భారమే కారణం
బలిజిపేట మండలం గంగాపురంలో అప్పుల భారంతో వ్యక్తి సూసైడ్ చేసుకున్నారు. ఈ ఘటన బుధవారం చోటుచేసుకుంది. ఎస్సై సింహాచలం వివరాల ప్రకారం.. ఇటుక బట్టీ నిర్వహిస్తున్న రవి అప్పులు ఎక్కువగా చేశాడు. వీటిని సమయానికి తీర్చలేక ఒత్తిడికి గురయ్యాడు. ఈ క్రమంలో మంగళవారం గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చికిత్స కోసం విజయనగరం తరలించగా బుధవారం మృతిచెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
News November 28, 2024
విజయనగరం జిల్లాకు DIG గోపీనాధ్ జెట్టీ రాక
విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టీ జిల్లాలో గురువారం పర్యటించనున్నారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆధ్వర్యంలో స్థానిక పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో పోలీసు ఉద్యోగులకు వార్షిక క్రీడా పోటీలను నిర్వహించనున్నారు. ఈ క్రీడా పోటీలను డీఐజీ గోపీనాథ్ జట్టి గురువారం ఉదయం 8గంటలకు ప్రారంభించనున్నారు. కాగా ఈ పోటీలు ఈ నెల 30 వరుకు కొనసాగనున్నాయి.