News February 7, 2025

మన్యం బంద్‌కు ఆదివాసి ఉద్యోగ సంఘాల మద్దతు

image

ఈ నెల 12న తలపెట్టిన మన్యం బంద్‌కు ఆదివాసి ఉద్యోగ సంఘాల జేఏసీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని ఆదివాసి ఉద్యోగ జేఏసీ జిల్లా అధ్యక్షుడు సోడే నారాయణ గురువారం అన్నారు. చింతూరులో జేఏసీ సమావేశాన్ని నిర్వహించారు. 1/70 చట్టం సవరణ చేయడానికి అధ్యయనం చేయాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు సూచించడం మంచిది కాదన్నారు. ఇప్పటికే మాకు జీవనాధారమైన జీవో నంబర్-3ని దూరం చేశారన్నారు. బంద్ పిలుపుకు ఉద్యోగ జేఏసీ మద్దతు ఉంటుందన్నారు.

Similar News

News February 7, 2025

‘లైలా’ ప్రీరిలీజ్ వేడుకకు మెగాస్టార్

image

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన ‘లైలా’ సినిమా ఈనెల 14న విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ వేడుకను ఏర్పాటు చేస్తున్నారు. దీనికి మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్‌గా రానున్నారు. ఇప్పటికే విశ్వక్‌తో పాటు ‘లైలా’ నిర్మాత చిరును కలిసి వేడుకకు రావాల్సిందిగా ఆహ్వానించారు. దీనికి సంబంధించిన ఫొటోలను మేకర్స్ పంచుకున్నారు.

News February 7, 2025

మేడారం భక్తులకు బ్యాటరీ ఆఫ్ టాప్స్

image

మేడారం మినీ జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం పలు ప్రాంతాల్లో బ్యాటరీ ఆఫ్ టాప్స్‌లను అధికారులు ఏర్పాటు చేశారు. సమ్మక్క-సారలమ్మ వనదేవతల దర్శనం అనంతరం భక్తులు సమీపంలోని అటవీ ప్రాంతాలు, ఖాళీ ప్రదేశాల్లో వనభోజనాలు చేస్తుంటారు. ఈ క్రమంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నల్లాలను, చేతిపంపులను సైతం ఏర్పాటు చేశారు. కాగా, నీటిని వృథా చేయొద్దని సూచించారు.

News February 7, 2025

DAY 5: కడప కలెక్టర్‌ను కలిసిన విద్యార్థులు

image

ప్రొద్దుటూరు మండలం గోపవరం పశు వైద్య కళాశాల విద్యార్థుల నిరసన ఐదో రోజుకు చేరింది. ఇవాళ వెటర్నరీ విద్యార్థులు జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరిని, అలాగే కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డిని కలిసి తమ సమస్యలు తెలుపుకున్నారు. తమ డిమాండ్లను వారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. వీలైనంత త్వరగా తమకు స్టైఫండ్ ఇప్పించాలని కోరారు. లేదంటే చలో అమరావతి నిర్వహిస్తామని విద్యార్థులు హెచ్చరించారు.

error: Content is protected !!