News June 3, 2024

మన ఎంపీ వంశీకృష్ణనా.. కొప్పులనా.. శ్రీనివాసా?

image

లోక్‌సభ ఎన్నికల ఫలితాలు రేపే వెలువడనుండడంతో పెద్దపల్లి ఎంపీ స్థానంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక్కడ BRS నుంచి కొప్పుల ఈశ్వర్, కాంగ్రెస్ నుంచి గడ్డం వంశీకృష్ణ, BJP నుంచి గోమాస శ్రీనివాస్ పోటీలో ఉన్నారు. కాగా కాంగ్రెస్, BJP మధ్య పోటీ ఉంటుందని పలువురు అంటుండగా.. BRS, కాంగ్రెస్ మధ్య పోటీ ఉందని మరికొందరు అంటున్నారు. దీంతో ఈ స్థానం ఫలితంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Similar News

News October 1, 2024

KNR: పెత్తర అమావాస్యకు పెద్ద చిక్కు..!

image

సంవత్సరానికి ఒక్కసారి పెద్దలకు నైవేద్యం పెట్టుకునే పెత్తర అమావాస్యకు పెద్ద చిక్కు వచ్చి పడింది. అదే రోజు గాంధీ జయంతి కావడంతో అటు మాంసాహారం, మందు బంద్ ఉండడంతో పెత్తర అమావాస్య జరుపుకునేది ఎట్లా అని ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసులు ఆలోచనలో పడ్డారు. పెత్తర అమావాస్యను కొందరు మంగళవారం లేదా గురువారం చేసుకోవడానికి ఆసక్తి చూపగా, పంతుళ్లు మాత్రం మంగళవారమే చేసుకోవాలని సూచిస్తున్నారు.

News October 1, 2024

జగిత్యాల జిల్లా DSC టాపర్‌గా జిందం అజయ్‌కుమార్

image

నిన్న విడుదలైన డీఎస్సీ ఫలితాల్లో కోరుట్లకు చెందిన జిందం అజయ్‌కుమార్ జిల్లా మొదటి ర్యాంకు సాధించాడు. స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ విభాగంలో 80.3 మార్కులతో జగిత్యాల జిల్లా టాపర్‌గా నిలిచాడు. దీంతో ఆయన్ను బంధుమిత్రులు, స్నేహితులు అభినందిస్తున్నారు.

News October 1, 2024

దొంగతనాల నివారణకు ఒక స్పెషల్ టీం: జగిత్యాల ఎస్పీ

image

జగిత్యాల జిల్లాలోని దొంగతనాల నివారణకు ప్రతి సర్కిల్ పరిధిలో ఒక స్పెషల్ టీం నియమించి వాటిని నివారణకు కృషి చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. అంతేకాకుండా ప్రాసిక్యూషన్‌లో భాగంగా కోర్టు వారు జారీ చేసిన నాన్‌బెయిలబుల్ వారెంట్లను నిందితుడిపై లేదా తప్పించుకుని తిరుగుతున్న నేరస్తులపై అమలుచేయడానికి అధికారులు అందరూ కృషి చేయాలని సూచించారు.