News June 3, 2024
మన ఎంపీ వంశీకృష్ణనా.. కొప్పులనా.. శ్రీనివాసా?
లోక్‌సభ ఎన్నికల ఫలితాలు రేపే వెలువడనుండడంతో పెద్దపల్లి ఎంపీ స్థానంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక్కడ BRS నుంచి కొప్పుల ఈశ్వర్, కాంగ్రెస్ నుంచి గడ్డం వంశీకృష్ణ, BJP నుంచి గోమాస శ్రీనివాస్ పోటీలో ఉన్నారు. కాగా కాంగ్రెస్, BJP మధ్య పోటీ ఉంటుందని పలువురు అంటుండగా.. BRS, కాంగ్రెస్ మధ్య పోటీ ఉందని మరికొందరు అంటున్నారు. దీంతో ఈ స్థానం ఫలితంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
Similar News
News September 20, 2024
మంచిర్యాల: పురుగు మందు తాగి మెప్మా ఉద్యోగి ఆత్మహత్య
పురుగు మందు తాగి మెప్మా ఉద్యోగి రమేష్(36) ఆత్మహత్య పాల్పడిన ఘటన హాజీపూర్ మండలం ముల్కల్లలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం..లక్షెట్టిపేట మండలం వెంకట్రావుపేటకు చెందిన రమేశ్ మంచిర్యాలలో నివాసం అంటూ మెప్మాలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. 2 రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లిన రమేశ్ పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
News September 20, 2024
బోథ్: రూ.81 వేల ధర పలికిన గణేశ్ లడ్డూ
బోథ్ మండల కేంద్రంలోని చైతన్య యూత్ గణేశ్ మండలి ఆధ్వర్యంలో గణేశ్‌ను ఏర్పాటు చేశారు. నిత్యం భక్తిశ్రద్ధలతో వినాయకుడిని కొలిచారు. కాగా గురువారం రాత్రి లడ్డూ వేలం పాట నిర్వహించారు. హోరాహోరీగా సాగిన వేలంలో చివరగా రూ.81 వేలకు మండల కేంద్రానికి చెందిన ఇట్టెడి చిన్నారెడ్డి దక్కించుకున్నాడు. ఈ సందర్భంగా మండలి కమిటీ సభ్యులు ఆయనను శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు శ్రీకాంత్, మహేందర్ ఉన్నారు.
News September 20, 2024
ADB: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
నేరడిగొండ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను గురువారం జిల్లా పాలనాధికారి రాజర్షి షా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రి సిబ్బంది హాజరు రిజిష్టర్, రికార్డులను పరిశీలించారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలని సిబ్బందిని ఆదేశించారు. వైద్యం కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చిన రోగులతో మాట్లాడి ఆసుపత్రిలో అందుతున్న సేవలపై ఆరా తీశారు. అనంతరం ఆసుపత్రి ఆవరణలో మొక్కలు నాటారు.