News October 12, 2024
మన ఏలూరు జిల్లాకు రెండో స్థానం

ఏలూరు జిల్లాలో మద్యం షాపులకు దరఖాస్తుల గడువు శుక్రవారంతో ముగిసింది. మద్యం షాపులకు దరఖాస్తులు వెల్లువెత్తడంతో రాష్ట్రంలోనే ఏలూరు జిల్లా రెండో స్థానంలో నిలిచింది. మొత్తం5,339 దరఖాస్తులు అందినట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది.ఈ నెల 14న లాటరీ పద్ధతిలో షాపులను కేటాయించనున్నారు. దీంతో దరఖాస్తు దారులంతా టెన్షన్ తో ఎదురుచూస్తున్నారు.
Similar News
News February 8, 2026
ఉప ఉత్పత్తులపై మిల్లర్లు దృష్టి పెట్టాలి: కలెక్టర్

రైస్ మిల్లర్లు విలువ ఆధారిత ఉత్పత్తులపై దృష్టి సారించాలని కలెక్టర్ నాగరాణి సూచించారు. పెదఅమిరంలో శనివారం రైస్ మిల్ యజమానులు, పరిశ్రమ ప్రతినిధులతో అవగాహన సదస్సు నిర్వహించారు. మిల్లింగ్‌లో వచ్చే ఉప ఉత్పత్తులను సరిగ్గా వినియోగిస్తే ఆర్థికంగా బలపడవచ్చని తెలిపారు. బై ప్రొడక్ట్స్ వృథా కాకుండా ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను మిల్లర్లు అందిపుచ్చుకోవాలని కలెక్టర్ కోరారు.
News February 8, 2026
లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు: డీపీఎంవో

గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని డీపీఎంఓ డాక్టర్ సీహెచ్ ధనలక్ష్మి హెచ్చరించారు. శనివారం భీమవరంలో నిర్వహించిన డివిజన్ స్థాయి సలహా సంఘం సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలోని అన్ని స్కానింగ్ కేంద్రాలను నిరంతరం తనిఖీ చేయాలని, నిబంధనలు ఉల్లంఘించే వారిని పట్టుకునేందుకు క్రమం తప్పకుండా డెకాయ్ ఆపరేషన్లు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.