News February 16, 2025
మన ఖమ్మం విత్తనాలు రాష్ట్రాలు చుట్టేస్తున్నాయ్..!

సాగులో మందుల వినియోగం తగ్గించేందుకు నాణ్యమైన ఉత్పత్తితో 400 రకాల విత్తనాలను వివిధ రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నాడు భద్రాద్రి జిల్లా సుజాతనగర్‌కు చెందిన రైతు మన్నేపల్లి రవి. సాగుపై ఇష్టంతో ఇంజినీరింగ్ చదివిన కుమారుడు హర్షతో కలిసి తన పొలంతో పాటు 300 ఎకరాలను కౌలుకు తీసుకొని విత్తనాలను ఉత్పత్తి చేస్తున్నారు. పురుగు మందుల వినియోగం అవసరం లేని విత్తనాలను ఉత్పత్తి చేయడమే తమ లక్ష్యమని వారు అంటున్నారు.
Similar News
News March 15, 2025
ఖమ్మం: గుర్తు తెలియని వాహనం ఢీ.. వ్యక్తి మృతి

నిత్యం వార్తా పత్రికలు చేరవేస్తున్న వ్యక్తి.. గుర్తు తెలియని వాహనం ఢీకొని మరణించడంతో వార్తలో నిలిచిన ఘటన చింతకాని మండలంలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మం జిల్లా రఘునాథపాలెంకు చెందిన రాజుల అనిల్ అనే వ్యక్తి డైలీ న్యూస్ పేపర్స్‌ను ఆటోలో చేరవేస్తుంటాడు. ఈ క్రమంలో వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.
News March 15, 2025
ఖమ్మం: భార్యతో గొడవ.. భర్తను అప్పగించిన పోలీసులు

భార్యతో గొడవ పడి ఓ వ్యక్తి ఇంటి నుంచి బయటకు వెళ్లగా మధిర పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఖమ్మం 3టౌన్‌కు చెందిన D.శ్రీనివాసరావు గత రెండు రోజుల క్రితం తన భార్యతో గొడవపడి, ఇంటి నుంచి బయటికి వెళ్లాడు. శుక్రవారం మధిరలో ఉన్నట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందగా వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి శ్రీనివాసరావును కుటుంబ సభ్యులకు అప్పగించారు.
News March 15, 2025
ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

∆} ఖమ్మం జిల్లాలో నేటి నుంచి ఒంటిపూట బడులు ∆} పలు శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం ∆} జమలాపురం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు ∆} మాదారం అంకమ్మ తల్లి జాతర ప్రారంభం ∆} జూలూరుపాడులో రాందాస్ నాయక్ పర్యటన ∆} ప్రశాంతంగా కొనసాగుతున్న ఇంటర్ పరీక్షలు ∆} నగరంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం.