News May 17, 2024

మన గుంటూరు గురించి ఇది తెలుసా..!

image

దేశభాషలందు తెలుగు లెస్స!.. దీనిని శ్రీకృష్ణదేవరాయలు మొదట అన్నారని మనకి తెలుసు. కానీ ఆయన 16వ శతాబ్దానికి చెందినవారు. కానీ ఈ వాక్యాన్ని మొట్టమొదటిసారి 15వ శతాబ్దంలో మన గుంటూరు జిల్లాకు చెందిన వినుకొండ వల్లభ రాయుడు “జనని సంస్కృతంబు సకల భాషలకును, దేశభాషలందు తెలుగు లెస్స” అని క్రీడాభిరామం అనే ప్రముఖ వీధి నాటకంలో రాశారు. కాగా వినుకొండ వల్లభరాయల పూర్వులు గుంటూరు సీమలోని వినుకొండ వాస్తవ్యులు.

Similar News

News April 23, 2025

టెన్త్ ఫలితాల్లో అద్భుతంగా రాణించిన గుంటూరు

image

గుంటూరు జిల్లా పదో తరగతి పరీక్షల్లో అద్భుతంగా రాణించింది. రెగ్యులర్ విద్యార్థులలో 27,255 మంది పరీక్ష రాయగా, 24,169 మంది ఉత్తీర్ణత సాధించి 88.53 శాతంతో రాష్ట్రంలో నాలుగవ స్థానాన్ని దక్కించుకుంది. గతేడాది ఉత్తీర్ణత 86.69శాతంతో 16వ స్థానంలో నిలిచింది. ఈసారి ఏకంగా 12 స్థానాలు మెరుగుపర్చుకుని 4వ స్థానంలో నిలవడం విశేషం.

News April 23, 2025

10th RESULTS: 4వ స్థానంలో గుంటూరు జిల్లా

image

పదో తరగతి పరీక్షా ఫలితాల్లో గుంటూరు జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. మొత్తం 27,255 మంది పరీక్ష రాయగా 24,129 మంది పాసయ్యారు. 14444 మంది బాలురులో 12567 మంది, 12811 మంది బాలికలు పరీక్ష రాయగా 11562 మంది పాసయ్యారు. 88.53 పాస్ పర్సంటైల్‌తో జిల్లా రాష్ట్రంలో 4వ స్థానంలో నిలిచింది.

News April 23, 2025

డిప్యూటీ మేయర్ పదవి ఎవరిని వరించేనో?

image

మేయర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైన సందర్భంగా గుంటూరులోని అధికార పార్టీ నేతల్లో డిప్యూటీ మేయర్ ఆశావాహుల సందడి మొదలైంది. మేయర్ అభ్యర్థిగా కోవెలమూడి నాని పేరు ఇప్పటికే అధిష్టానం ఖరారు చేయగా, డిప్యూటీ మేయర్ విషయంలో చిక్కుముడి ఇంకా వీడలేదు. బీసీ వర్గానికి చెందిన యల్లావుల అశోక్ పేరు గట్టిగా వినిపిస్తుండగా, ఇన్‌ఛార్జి మేయర్ సజీల మేయర్ ఎన్నిక తర్వాత పాత పదవిని కొనసాగించాలని అధిష్ఠానాన్ని కోరుతున్నారు.

error: Content is protected !!