News August 11, 2024

మన జిల్లాలో నేటి వర్షపాత వివరాలు ఇలా…

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆదివారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా ఉన్నాయి అత్యధికంగా మహబూబ్నగర్ జిల్లా దేవరకద్రలో 30.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. వనపర్తి జిల్లా కేతపల్లి లో 30.0 మిల్లీమీటర్లు, నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లిలో 20.3 మిల్లీమీటర్లు, గద్వాల జిల్లా కేంద్రంలో 16.5 మిల్లీమీటర్లు, చిన్నజట్రంలో 8.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

Similar News

News September 17, 2024

MBNR రీజియన్‌కు 75 పల్లె వెలుగు బస్సులు అవసరం !

image

ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రభుత్వం కల్పించడంతో రోజువారీగా ఆర్టీసీ బస్సులలో తీవ్ర రద్దీగా ఉంటున్నాయి. అధిక లోడుతో కాలం చెల్లిన బస్సులు అక్కడక్కడ ఆగిపోతున్నాయి. ప్రయాణం సాఫీగా సాగాలంటే మహబూబ్ నగర్ ఆర్టీసీ రీజియన్‌కు 75పల్లె వెలుగు బస్సులు అవసరం ఉందని అంచనాతో ఆర్టీసీ అధికారులు నివేదిక అందజేశారు. దీంతో డీపోలకు నూతన పల్లె వెలుగు బస్సులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

News September 17, 2024

మహబూబ్‌నగర్: హైడ్రా ప్రభావంతో ఉమ్మడి జిల్లాలో తగ్గిన రిజిస్ట్రేషన్లు

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో హైడ్రా తీవ్ర ప్రభావం చూపుతోంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో అనేక అక్రమ భవనాలు కూల్చివేయడంతో ఉమ్మడి పాలమూరులో భూముల కొనుగోళ్లు, రిజిస్ట్రేషన్లు తగ్గాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జూలై నెలలో 11,360 రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.23.81 కోట్ల ఆదాయం సమకూరగా.. ఆగస్టు నెలలో 7,315 రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.19.31 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరడం గమనార్హం.

News September 17, 2024

వనపర్తి: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

image

వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం రంగాపురంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. స్థానికులు తెలిపిన వివరారు.. గ్రామానికి సమీపంలోని పోగాకు కంపెనీ వద్ద జాతీయ రహదారిపై హైదారాబాద్ నుంచి కర్నూల్ ​వెళ్తున్న ఆర్టీసీ సూపర్ డీలక్స్ బస్సు, టీవీఎస్​ ఎక్స్​ఎల్​ వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ఎక్స్ ఎల్ పై ఉన్న పెండ్లి రాముడు అక్కడిక్కడే మృతి చెందగా శేఖర్ ఆసుపత్రికు తరలిస్తున్న మార్గమధ్యలో మృతి చెందాడు