News November 12, 2024

మన నెల్లూరు జిల్లాకు బడ్జెట్‌లో వచ్చింది ఎంతంటే?

image

నిన్న రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. ఈ బడ్జెట్‌లో నెల్లూరు జిల్లాకు ఎంత నిధులు కేటాయించారంటే..(కోట్లలో)
➤రామాయపట్నం పోర్టుకు రూ.100,
➤ కృష్ణపట్నం పోర్టుకు రూ.37
➤సోమశిల ప్రాజెక్టుకు రూ.209.55
➤ పెన్నా రివర్ కెనాల్ సిస్టంకు రూ.33.42
➤సోమశిల- స్వర్ణముఖి లింక్‌నకు రూ.66
➤కండలేరు లిఫ్ట్ ఇరిగేషన్‌కు రూ.11
➤కనుపూరుకాలువకు రూ.7
➤ వీఎస్‌యూ రూ.20.69 కోట్లు

Similar News

News November 28, 2025

గొప్ప సంఘ సంస్కర్త జ్యోతిరావు ఫూలే: జేసీ

image

మహాత్మా జ్యోతి రావు ఫూలే వర్ధంతి సందర్భంగా శుక్రవారం ఆయన విగ్రహానికి జిల్లా జాయింట్ కలెక్టర్ యం.వెంకటేశ్వర రావు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన మాట్లాడుతూ.. ఫూలే గొప్ప సంఘ సంస్కర్త అని కొనియాడారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహోన్నత వ్యక్తి అని, కుల వివక్షత నిర్మూలనకై పోరాడారన్నారు.

News November 28, 2025

నెల్లూరులో గూడూరును కలవనీయకుండా అందుకే అడ్డుకున్నారా.?

image

గూడూరును నెల్లూరులో కలవనీయకుండా ఓ బడా పారిశ్రామికవేత చక్రం తిప్పినట్లు సమాచారం. 3 నియోజకవర్గాల్లో క్వార్జ్, అబ్రకం, మైకా వంటి ఖనిజాలు పుష్కలం. ఇవి నెల్లూరుకు వెళితే ఖనిజాలపై ‘రెడ్ల’ ఆధిపత్యం పెరుగుతుందని దీనిని అడ్డుకోవడానికి ఇలా చేసినట్లు తెలుస్తోంది. ఆయన ఎన్నికల్లోనూ ఆర్థికంగా ప్రభావం చూపించారట. తిరుపతి గ్రేటర్ పరిధి పెరుగుతన్న క్రమంలో గూడూరును సాంకేతికంగా నెల్లూరులో కలపలేదన్న వాదన కూడా ఉంది.

News November 28, 2025

నెల్లూరు మేయర్‌గా దేవరకొండ సుజాత..?

image

నెల్లూరు నగర మేయర్‌గా దేవరకొండ సుజాతను ఎంపిక చేసేందుకు టీడీపీ సిద్ధం అవుతోన్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 15లోగా ప్రస్తుత మేయర్‌పై అవిశ్వాస తీర్మానానికి సంబంధించి సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉందని సమాచారం. అనేక అంశాలను పరిశీలించి సుజాత పేరును అధిష్ఠానం ఖరారు చేసినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి ఈమె పేరును ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.