News April 19, 2025
మన ‘పాకాల’ నీరు.. సముద్రంలో కలుస్తోందిలా!

వరంగల్ జిల్లా ఖానాపురం మండలం పాకాల సరస్సు వరద నీరు 192 కి.మీ ప్రవహించి కృష్ణా నదిలో కలుస్తోంది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ‘పాకాల’ వాగు.. ప్రవాహ క్రమేణా ‘మున్నేరు’గా మారి ఏపీలోని కంచికచర్ల వద్ద కృష్ణా నదిలో కలుస్తోంది. ప్రకాశం బ్యారేజీ మీదుగా బంగాళాఖాతం సముద్రంలో కలుస్తోంది. ఉమ్మడి జిల్లాలోని నర్సంపేట, మహబూబాబాద్, డోర్నకల్ ప్రాంత రైతులకు, ప్రజలకు పాకాల నీరు జలవనరుగా ఉంది.
Similar News
News April 20, 2025
గోవిందరావుపేట: భూ భారతిపై రైతులు అవగాహన పెంచుకోవాలి: కలెక్టర్

తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూ భారతి చట్టంపై రైతులు అవగాహన పెంచుకోవాలని కలెక్టర్ టిఎస్ దివాకర్ అన్నారు. గోవిందరావుపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన భూ భారతి చట్టం అవగాహన సదస్సులో కలెక్టర్ మాట్లాడారు. రెవెన్యూ సమస్యలపై ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించిన తర్వాతే సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుడతామన్నారు. అధికారులు గ్రామాల వారిగా సదస్సులు ఏర్పాటు చేస్తారని తెలిపారు.
News April 20, 2025
బాపట్ల: రేపు చీరాలలో ప్రజా వేదిక- కలెక్టర్

బాపట్ల జిల్లా చీరాల మున్సిపల్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నారు. ఈ మేరకు బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10:30 గంటలకు మున్సిపల్ కార్యాలయంలో ఈ సమావేశం మొదలవుతుందని పేర్కొన్నారు. ప్రజలు ఈ వేదికను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
News April 20, 2025
HYDలో 2 దశాబ్దాల తర్వాత పోరు!

HYD స్థానిక కోటా MLC ఎన్నికలకు రంగం సిద్ధమైంది. గత 22 ఏళ్లుగా ఈ స్థానం ఏకగ్రీవమే. ఈ సారి పోటీకి BJP సిద్ధమవడం విశేషం. ఈ కోటాలో 81 మంది కార్పొరేటర్లు, 31 మంది ఎక్స్ అఫిషియోలతో కలిపి మొత్తం 112 మంది ఓటర్లు ఉన్నారు. MIMకు 50 ఓట్లు, BRSకు 24, BJPకి 24, INCకు 14 ఓట్లు ఉన్నాయి. INC ఎన్నికకు దూరం ఉండగా.. BRS ఏకంగా పోలింగ్‌ను బాయ్‌కాట్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ 23న MIMతో BJP పోటీ పడుతోంది.