News July 17, 2024
మన పామర్రు అమ్మాయి US మిసెస్ వైస్ ప్రెసిడెంట్?
US ప్రెసిడెంట్ ఎన్నికలలో వైస్ ప్రెసిడెంట్‌గా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న JD వాన్స్ భార్య ఉష చిలుకూరి తల్లిదండ్రులు పామర్రుకు చెందినవారు. ఉష తల్లిదండ్రులు రాధాకృష్ణ, లక్ష్మీ అమెరికా వలస వెళ్లగా 3వ సంతానంగా ఉష జన్మించారు. కాలేజీ చదువు అనంతరం వాన్స్‌ను ప్రేమించిన ఉష హిందూ పద్ధతిలో వివాహం చేసుకుంది. ఎన్నికల్లో ట్రంప్ గెలిస్తే మన జిల్లా అమ్మాయి ఉష USకి మిసెస్ వైస్ ప్రెసిడెంట్ అవుతారు.
Similar News
News December 9, 2024
ఇబ్రహీంపట్నంలో మృతదేహం కలకలం
ఇబ్రహీంపట్నంలోని వీటీపీఎస్ కూలింగ్ కెనాల్ స్టేజ్ 1 గేట్ వద్ద సోమవారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు ఇబ్రహీంపట్నం పోలీసులు తెలిపారు. మృతుడు 5’5”అడుగుల ఎత్తు ఉండి సుమారు 50 ఏళ్ల వయస్సు ఉంటుందన్నారు. మృతుడు బిస్కెట్ కలర్ చొక్కా ధరించి ఉన్నట్లు చెప్పారు. వివరాలు తెలిస్తే ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని కోరారు.
News December 9, 2024
మచిలీపట్నం: ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన కలెక్టర్
కృష్ణాజిల్లా కలెక్టరేట్ మీటింగ్ హాలులో సోమవారం నిర్వహించిన ‘మీకోసం’ కార్యక్రమంలో కలెక్టర్ డీకే బాలాజీ పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా నలుమూలల నుంచి ప్రజలు కలెక్టరేట్‌కు వచ్చి కలెక్టర్‌కు తమ సమస్యలను అర్జీల రూపంలో తెలిపారు. ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను పరిష్కార చర్యల నిమిత్తం సంబంధిత శాఖాధికారులకు కలెక్టర్ బదిలీ చేశారు.
News December 9, 2024
బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై పోక్సో కేసు నమోదు
బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన కుటుంబ సభ్యుడిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. సత్యనారాయణపురం పోలీసుల వివరాల మేరకు.. ఓ బాలిక ఇంటి వద్ద ఆడుకుంటుంది. వరుసకు బాబాయ్ కొడుకు అయినా కార్తీక్ అనే యువకుడు తన ఇంట్లోకి తీసుకెళ్లి బాలికపై అసభ్యంగా ప్రవర్తించాడని ఆ బాలిక తల్లిదండ్రుల దృష్టికి తీసుకువెళ్లింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.