News November 11, 2024
మన ప.గో ఎమ్మెల్యేలు అసెంబ్లీలో గళం వినిపిస్తారా?
నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. వాటికి ఉమ్మడి ప.గో జిల్లా ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. ఎన్నికల అనంతరం జరుగుతున్న తొలి బడ్జెట్ సమావేశం కావడంతో ప్రజల్లోనూ, నాయకుల్లోనూ ఉత్కంఠ నెలకొంది. ఎన్నికలకు ముందు గ్రామంలో సమస్యలు , యువతకు ఉద్యోగాలు వంటి అంశాలపై ఎన్నికైన ఎమ్మెల్యేలు హామీలు గుమ్మరించారు. మరి వాటి అమలుకు నిధులు వచ్చేలా అసెంబ్లీలో గళం వినిపిస్తారా? లేదా? మీరేమంటారు. కామెంట్ చేయండి.
Similar News
News November 27, 2024
ఉండి యువతికి కీలక ఉద్యోగం
దేశస్థాయిలో ప.గో జిల్లా యువతి సత్తా చాటారు. ఉండి పెదపేటకు చెందిన నిస్సీ ప్లోరా డిగ్రీ BSC చదివారు. తర్వాత ఆమె హార్టికల్చర్ విభాగంలో పీహెచ్డీ చేశారు. దేశంలోని 16 కీలక పోస్టులకు 16 వేల మంది పరీక్షలు రాశారు. ఈక్రమంలో నిస్సీ ఫ్లోరా ప్రతిభ చూపి అహ్మదాబాద్లోని నేషనల్ హార్టీకల్చర్ డిప్యూటీ డైరెక్టర్గా ఎంపికయ్యారు. నిస్సీ తండ్రి ఏసురత్నం రిటైర్డ్ టీచర్. తల్లి వర్జీనియా స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్నారు.
News November 27, 2024
భీమవరం నుంచి మలేషియా పంపి మోసం
మలేషియా పంపి మోసం చేసిన ఘటన భీమవరంలో జరిగింది. ‘నేను భీమవరంలోని మోటుపల్లివారి వీధిలో ఉంటున్నా. ప్రకాశ్ నగర్కు చెందిన ఓ మహిళ రూ.1.50 లక్షలు తీసుకుని పంబ్లింగ్ పని కోసం నన్ను మలేషియా పంపింది. కానీ ఓ హోటల్లో పనికి పెట్టి జీతం ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు. తిరిగి భీమవరం పంపాలని నా భార్య ఆ మహిళను కోరినా పట్టించుకోలేదు. తెలిసిన వాళ్ల ద్వారా భీమవరం వచ్చా’ అని బాధితుడు నాగరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
News November 27, 2024
ఆకివీడులో 40 అడుగుల బొప్పాయి చెట్టు
పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆకివీడు నగరపంచాయతీలో కాకరపర్తి వీధిలో సత్యనారాయణ పెరటిలో బొప్పాయి చెట్టు అబ్బుర పరుస్తుంది. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ బొప్పాయి సాధారణంగా ఐదు నుంచి పది పన్నెండు అడుగులు ఎత్తు వరకు ఎదుగుతాయి అన్నారు. తన పెరటిలో నాటిన మొక్క సుమారు 40 అడుగులు వరకు పెరిగి అందరిని ఆశ్చర్య పరుస్తుంది అన్నారు. తాను ఐదు సంవత్సరాల క్రితం నాటినట్టు ఆయన తెలిపారు.