News February 24, 2025
మన వికారాబాద్ జిల్లా నేటి కార్యక్రమాలు

√ నేటితో ముగియనున్న పోలేపల్లి ఎల్లమ్మ తల్లి బ్రహ్మోత్సవాలు.√ కొడంగల్లో నేడు ఉచిత కంటి వైద్య శిబిరం.√ నేడు జిల్లాలోని రైతులకు పీఎం కిసాన్ నిధులు జమ.√ పరిగి: నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం.√ నేడు కంకల్ వీరభద్రేశ్వర స్వామి ఆలయంలో గీతా యజ్ఞ పారాయణం.√ తాండూరు: నేడు పల్లెగడ్డ హనుమాన్ దేవాలయం వద్ద లింగస్థాపన.√ నేడు ఆయా నియోజకవర్గాల్లో పర్యటించనున్న ఎమ్మెల్యేలు.
Similar News
News October 22, 2025
వరంగల్లో నకిలీ ఏసీబీ మోసం

గుర్తు తెలియని వ్యక్తులు ఏసీబీ అధికారులమని చెప్పి ఆర్టీఏ ఎంవీఐల నుంచి దశల వారీగా రూ.10.20 లక్షలు కాజేశారు. ఫోన్లలో నకిలీ బెదిరింపులు చేయడంతో ఓ ఎంవీఐకు అనుమానం రావడంతో వెంటనే WGL ఏసీబీ డీఎస్సీ సాంబయ్యను ఆశ్రయించారు. దీంతో నిజం తెలిసింది. ఆర్టీఏ అధికారులు మోసపోయిన వివరాలు గుట్టుగా ఉంచాలని ప్రయత్నించగా, స్థానిక పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దుండగులను వెతికే పనిలో పడ్డారు.
News October 22, 2025
ములుగు: మహా జాతరకు ఇంకా 98 రోజులే !

మేడారం సమ్మక్క, సారలమ్మ మహా జాతరకు ఇంకా 98 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. జాతర సమయం దగ్గర పడుతుండగా పూర్తిస్థాయిలో అభివృద్ధి పనులు ఇంకా ప్రారంభం కాలేదు. గద్దెల విస్తరణ పనులు తప్ప ఇతర పనులు ఇంకా మొదలు కాకపోవడంతో సర్వత్ర ఆందోళన నెలకొంది. జాతర సమయానికి పనులు పూర్తవుతాయా ?, ప్రతి జాతరలా హడావిడి పనులు చేసి చేతులు దులుపుకుంటారా ? అని భక్తులు అనుమానవం వ్యక్తం చేస్తున్నారు.
News October 22, 2025
జీకే వీధి: డోలి మోతలోనే యువతి మృతి

జీకే వీధి (M) నేలపాడులో సుమిత్ర (22) మంగళవారం కాఫీ తోటకు వెళుతూ మార్గ మధ్యలో స్పృహ తప్పి పడిపోయింది. గమనించిన గ్రామస్థులు ఆమెను డోలి కట్టి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే మృతి చెందింది. తమ గ్రామానికి రోడ్డు సదుపాయం ఉంటే తమ బిడ్డ బతికేదని, డోలిలో తీసుకెళ్లడం వల్ల వైద్యం సకాలంలో అందక మృతి చెందిందని కుటుంబీకులు వాపోయారు.