News March 6, 2025
మన హైదరాబాద్ కల్చర్ వేరు!

తెలుగు రాష్ట్రాల్లో మన హైదరాబాద్ కల్చర్ వేరు. ఊర్లో 10 ఎకరాలు ఉంటే గొప్ప. ఇక్కడ 100 గజాల్లో సొంతిళ్లు ఉన్నా గొప్పే. ఉన్నదాంట్లో సంతోషంగా ఉండేది హైదరాబాదీలే అనిపిస్తది. పండుగలు, పబ్బాలకు బలగం ఏకమవుతుంది. కుల, మత భేదం లేకుండా దోస్తానా కోసం జాన్ ఇస్తరు. మాస్కు కేరాఫ్ ధూల్‌పేట గల్లీలైతే, క్లాస్‌కు కేరాఫ్‌గా IT కారిడార్. ఏకంగా లక్షల మందికి మన HYD ఉపాధినివ్వడం విశేషం.
We Proud to Be A Hyderabadi
Similar News
News November 8, 2025
జూబ్లీ బైపోల్: మీకేం కావాలి? ఎంత కావాలి?’

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం రేపటితో క్లోజ్. ఇక వీధులు, బస్తీలు నిర్మానుష్యంగా మారుతాయి. సీన్ కట్ చేస్తే ప్రధాన నాయకుల ఇళ్లకు, గెస్ట్ హౌసులకు షిఫ్ట్ అవుతుంది. ప్రచారం ముగియగానే మంతనాలు షురూ అవుతాయి. గంపగుత్తగా ఓట్లు వేయించే వారిని ఇంతకుముందే గుర్తించిన నాయకులు వారితో రేపు చర్చలు జరిపే అవకాశముంది. ప్రతీ ఎన్నికల ముందులాగే.. మీకేం కావాలి? ఎంత కావాలి? అంటూ ప్రలోభపెడుతూ ఓట్లు రాబట్టుకునే పనిలో ఉంటారు.
News November 8, 2025
జూబ్లీహిల్స్: 3 రోజులు సెలవులు.. 2 రోజులు 144 సెక్షన్

జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. పోలింగ్ రోజు 11న నియోజకవర్గంలోని Govt, Pvt ఆఫీసులు, స్కూళ్లకు సెలవు ఉంటుంది. 10న పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేసిన స్కూళ్లలకు సెలవు ప్రకటించారు. 14న కౌంటింగ్ జరిగే ప్రాంతాల్లో సెలవు ఉంటుందని కలెక్టర్ హరిచందన ప్రకటించారు. అలాగే 10న సా.6 గం. నుంచి 11న సా.6 వరకు, 14న ఉ.6 గం. నుంచి 15న ఉ.6 వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని సీపీ సజ్జనార్ తెలిపారు.
News November 8, 2025
జూబ్లీ బైపోల్: మాగంటి మరణం చుట్టూ రాజకీయం

చావు కూడా రాజకీయాలకు అతీతం కాదని ప్రస్తుత జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం నిరూపిస్తోంది. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణం మిస్టరీ అని, దానిని ఛేదించాలని కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. సీఎం మరో ముందడుగు వేసి ఈ విషయంపై బండి సంజయ్ ఫిర్యాదు చేస్తే ప్రభుత్వం విచారణ చేస్తుందని పేర్కొన్నారు. దీంతో బైపోల్ పాలిటిక్స్ పీక్ స్థాయికి చేరుకున్నాయి.


