News March 6, 2025

మన హైదరాబాద్ కల్చర్ వేరు!

image

తెలుగు రాష్ట్రాల్లో మన హైదరాబాద్ కల్చర్ వేరు. ఊర్లో 10 ఎకరాలు ఉంటే గొప్ప. ఇక్కడ 100 గజాల్లో సొంతిళ్లు ఉన్నా గొప్పే. ఉన్నదాంట్లో సంతోషంగా ఉండేది హైదరాబాదీలే అనిపిస్తది. పండుగలు, పబ్బాలకు బలగం ఏకమవుతుంది. కుల, మత భేదం లేకుండా దోస్తానా కోసం జాన్ ఇస్తరు. మాస్‌కు కేరాఫ్ ధూల్‌పేట గల్లీలైతే, క్లాస్‌కు కేరాఫ్‌గా IT కారిడార్. ఏకంగా లక్షల మందికి మన HYD ఉపాధినివ్వడం విశేషం.
We Proud to Be A Hyderabadi

Similar News

News March 18, 2025

సీఎంకి ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యేలు

image

బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ తీసుకువచ్చిన బిల్లులకు శాసనసభ ఆమోదం తెలపడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ బిర్ల ఐలయ్య యాదవ్, షాద్‌నగర్ ఎమ్మెల్యే శంకర్, ప్రకాశ్‌గౌడ్, మాజీ ఎంపీ హనుమంతరావు కలిసి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. బలహీనవర్గాల హక్కుల కోసం చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్న సీఎంని ప్రశంసించారు.

News March 18, 2025

వృత్తిని ప్రేమించి.. బాధ్యతగా పని చేయండి: అజయ్ రావు

image

వృత్తిని ప్రేమించి బాధ్యతగా పని చేయాలని ఎక్సైజ్ అకాడమీ డైరెక్టర్ అజయ్ రావు అన్నారు. ఎక్సైజ్‌ శాఖలో మహిళా కానిస్టేబుళ్లుగా శిక్షణ పూర్తి చేసుకున్న 129 మంది విధుల్లో చేరుతున్న కానిస్టేబుల్స్ పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు చేసి.. శిక్షణలో నైపుణ్యం కలిగిన వారికి ఆయన సర్టిఫికెట్లు ప్రదానం చేశారు.

News March 18, 2025

RTC ఎండీ సజ్జనార్ క్రేజ్ ఇప్పుడు ఇంటన్నేషనల్

image

ఆర్టీసీ ఎండీ సజ్జనార్ Say no to betting apps #Tag తర్వాత దేశ, విదేశాల్లో ఫాలోయింగ్ భారీగా పెరిగింది. మీరు చెప్పేది నిజమే సర్ అంటూ లక్షలాది మంది కామెంట్లు పెడుతున్నారు. సజ్జనార్ ఇన్‌స్టాను 65 లక్షల మంది చూడగా X హ్యాండిల్‌ను 72 లక్షల మంది చూశారు. విదేశాల్లో మొరాకో, యూఎస్, యూఏఈ, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, కువైట్ దేశాల వాసుల నుంచి ఆయనకు సపోర్ట్ లభిస్తోంది.

error: Content is protected !!