News August 24, 2024
మరణించిన పోలీస్ వారి కుటుంబ సభ్యులకు అండగా ఉంటాం: ఎస్పీ
నంద్యాల: జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ నందు శుక్రవారం పోలీస్ శాఖలో పనిచేస్తూ వివిధ కారణాల ద్వారా మరణించిన పోలీస్ వారి కుటుంబ సభ్యులతో ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా సమావేశం నిర్వహించారు. అనంతరం కుటుంబాల సభ్యుల వివరాలు అడిగి తెలుసుకుని వారి యోగక్షేమాల గురించి అడిగి తెలుసుకున్నారు. పోలీస్ శాఖ ఎల్లప్పుడూ మీ సంక్షేమానికి అండగా ఉంటామని ఎస్పీ హామీ ఇచ్చారు.
Similar News
News September 11, 2024
డోన్‌కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా?
డోన్ పట్టణం పాతపేరు ద్రోణపురి. పాండవుల గురువైన ద్రోణాచార్యుడు తీర్థయాత్రలకు బయలుదేరి దారి మధ్యలో ఈ ప్రాంతంలోని కొండలపై కొంత సమయం బస చేస్తాడట. అందుకు గుర్తుగానే ఈ ప్రాంతానికి ద్రోణపురి అనే పేరు వచ్చిందని చరిత్ర చెబుతోంది. కాలానుగుణంగా ఈ పేరు ద్రోణాచలంగా మారింది. బ్రిటిష్ హయాంలో ఈ పట్టణం డోన్‌గా స్థిర పడింది. నీలం సంజీవరెడ్డి, కోట్ల విజయ భాస్కర రెడ్డి ఇక్కడి నుంచే ఎమ్మెల్యేలుగా గెలుపొందారు.
News September 11, 2024
చందలూరులో కుళాయి గుంతలో పడి బాలుడి మృతి
నంద్యాల జిల్లా రుద్రవరం మండలం చందలూరు గ్రామంలో కుళాయి గుంతలో పడి గౌతమ్ (5) అనే బాలుడు మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. సుబ్బయ్య, మహేశ్వరి దంపతుల కుమారుడు గౌతమ్ ఆడుకుంటూ ప్రమాదవశాత్తు కుళాయి కోసం తీసిన గుంతలో పడ్డాడు. కుటుంబ సభ్యులు గమనించి చూడగా అప్పటికే మృతి చెందాడు. గుంతలను పంచాయతీ అధికారులు పూడ్చకపోవడంతోనే తమ కుమారుడు మృతి చెందాడంటూ కుటుంబ సభ్యులు ఆరోపించారు.
News September 11, 2024
ఎలాంటి అపశ్రుతులు లేకుండా నిమజ్జనం పూర్తి చేయాలి: ఎస్పీ
గణేశ్ నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని ఎస్పీ బిందు మాధవ్ ఆదేశించారు. ఆదోని మండలం చిన్నహరివాణం ఎల్లెల్సీ కాలువ వద్ద గురువారం వినాయక ఘాట్‌ను ఆయన పరిశీలించారు. సిబ్బందితో మాట్లాడుతూ.. నిమజ్జనం సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. నిర్వాహకులకు సూచనలు చేస్తూ ఉండాలన్నారు.