News June 4, 2024
మరపురాని గెలుపును సొంతం చేసుకోనున్న శ్రీభరత్

విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఎం.శ్రీ భరత్ మరపురాని గెలుపును సొంతం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన ఓట్ల లెక్కింపులో శ్రీభరత్‌కు 8,20,427 ఓట్లు లభించాయి. వైసీపీ అభ్యర్థి బొత్స ఝాన్సీకి కేవలం 3,65,190 ఓట్లు మాత్రమే లభించాయి. దీంతో శ్రీభరత్ మెజారిటీ 4,55,231కి చేరింది. విశాఖ వేదికగా ఒక చారిత్రాత్మక విజయాన్ని శ్రీభరత్ సొంతం చేసుకోనున్నారు.
Similar News
News July 6, 2025
ప్రచార రథం ప్రారంభమయ్యేది అప్పుడే

జులై 9న మ.2 గంటలకు సింహాచలం గిరిప్రదక్షిణ ప్రచారరథం ప్రారంభమవుతుందని ఈవో త్రినాథరావు కలెక్టర్‌కు వివరించారు. తొలిపావంచా వద్ద అశోక్ గజపతి చేతుల మీదుగా ప్రచారరథం ప్రారంభమవుతుందన్నారు. ఆరోజు రాత్రి 11 గంటలకు రథం ఆలయానికి చేరుకుంటుందని, మరుసటి రోజు ఉ.5 నుంచి స్వామివారి దర్శనాలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.10వ తేదీ సాయంత్రం 7వరకు దర్శనాలు ఉంటాయన్నారు.
News July 6, 2025
ఈనెల 10న మెగా పేరెంట్ మీట్: కలెక్టర్

జిల్లాలని అన్ని పాఠశాలల్లో ఈనెల 10న మెగా పేరెంట్ మీట్ నిర్వహించాలని విశాఖ కలెక్టర్ ఎం.ఎన్ హరేంద్ర ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో ఉన్న 1385 పాఠశాలల్లో ప్రతి విద్యార్థి తల్లిదండ్రులతో హాజరవ్వాలన్నారు. తల్లి పేరుతో మొక్క నాటించాలని సూచించారు. మధ్యాహ్న భోజనం పథకంలో అతిథిలకు స్కూల్లోనే భోజనం అందించాలన్నారు 212 జూనియర్ కళాశాలలో తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించాలన్నారు.
News July 5, 2025
విశాఖలో టాస్క్‌ఫోర్స్‌కు అదనపు సిబ్బంది

విశాఖలో టాస్క్ ఫోర్స్ బలోపేతం చేసేలా పోలీస్ కమిషనర్ చర్యలు తీసుకున్నారు. ఇద్దరు సీఐల పర్యవేక్షణలో టాస్క్ ముమ్మరంగా దాడులు చేస్తున్న నేపథ్యంలో విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసే వారికి ప్రాధాన్యత ఇస్తూ మరో ఏడుగురి సిబ్బందిని నియమించారు. భీమిలి ఎస్ఐ హరీశ్‌తో పాటు ఒక హెడ్ కానిస్టేబుల్, మరో ఐదుగురు కానిస్టేబుళ్లను టాస్క్‌ఫోర్స్‌కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.